‘పవర్ స్టార్’ సినిమా ఎప్పుడు విడుదలంటే..!

-

ఆసక్తికర అంశాలను వెంటనే సినిమాగా రూపొందించగల దర్శకుడు ఆర్జీవీ ‘పవర్ స్టార్’ సినిమా రిలీజ్ డేట్ కూడా తెలిపాడు. జూలై 25 ఉదయం 11 గంటలకు ‘పవర్ స్టార్’ మూవీ విడుదల అవుతుందని వర్మ పేర్కొన్నారు. తాను స్థాపించిన మనసేన పార్టీ ఎన్నికల్లో భయంకరమైన ఓటమి పాలవడంతో చాలా బలహీన పడిపోయిన ఓ పవర్ ఫుల్ స్టార్ అంతర్మథనంతో ఈ సినిమా మొదలవుతుందని తెలిపారు. ఈ మేరకు తన వాయిస్‌తో ఓ వీడియో పోస్టు చేశారు.

అలాగే ఈ సినిమా ట్రైలర్ ను జూలై 22న ఉదయం 11 గంటలకు ‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్ డాట్ కామ్’ అనే వెబ్ సైట్లో విడుదల చేయబోతున్నట్టు వర్మ ఇప్పటికే ప్రకటించారు. ఈ ట్రైలర్ చూడ్డానికి 25 రూపాయలు కట్టాలని పేర్కొన్నాడు. కాగా, ఇప్పటికే ‘క్లైమాక్స్’ అనే సినిమాకు 100 రూపాయలు.. ఆ తర్వాత ‘నేక్డ్’ అనే మరో సినిమాకు 200 రూపాయలు టికెట్ పెట్టిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news