బెంగళూరు నగరంలో రోజురోజుకూ కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరిగిపోతుండటంతో జూలై 5 నుంచి ప్రతి ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శనివారం సీఎం యడియూరప్ప నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి బెంగళూరు నగరం ఇంఛార్జ్ మంత్రి ఆర్ అశోకా కూడా హాజరయ్యారు. అలాగే సోమవారం నుంచి రాత్రి సమయాల్లో 8దాటితే కర్ఫ్యూ విధించి ఉదయం 5గంటల వరకూ కొనసాగించనున్నట్లు వెల్లడించారు.
పైగా ఎనిమిది ప్రాంతాల్లోని జాయింట్ కమిషనర్లకు అదనపు బాధ్యతలు అప్పగించారు. బెంగళూరులోని కళ్యాణ మండపాలు, హాస్టళ్లు, ఇతర సంస్థలు కరోనా కేర్ సెంటర్లుగా మర్చాలంటూ సీఎం అధికారులను అడిగారు. అదేవిధంగా బెంగళూరులో సోమవారం నాటికల్లా కరోనా పేషెంట్స్ కోసం 10వేల పడకలను సిద్ధం చేయాలని, కరోనా పేషెంట్స్ కోసం అంబులెన్స్ సంఖ్యను కూడా పెంచాలని సూచించారు.