‘వలిమై’ సినిమా విడుదల తేదీని మర్చిపోయిన కార్తికేయ..!

-

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హీరో ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత కార్తికేయ అనేక సినిమాలలో నటించి తెలుగునాట మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత కార్తికేయ, నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన గ్యాంగ్ లీడర్ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కార్తికేయ తమిళ స్టార్ హీరో అయిన అజిత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘వలిమై’ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటించాడు.

ఈ సినిమా ఫిబ్రవరి 24 వ తేదీన తెలుగులో కూడా విడుదల కాబోతుంది. ఈ సినిమా విడుదల సందర్భంగా తాజాగా చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ ఏర్పాటు చేసింది. ఈ ఫంక్షన్ లో భాగంగా కార్తికేయ మాట్లాడుతూ ఈ సినిమా విడుదల తేదీని మర్చిపోయాడు. వలిమై సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో భాగంగా కార్తికేయ మాట్లాడుతూ ఫిబ్రవరి 24 వ తేదీన సినిమా విడుదల అవుతుంది అని చెప్పాల్సింది నవంబర్ 24 వ తేదీన సినిమా విడుదల అవుతుంది అని చెప్పేశాడు.

ఆ తర్వాత ఈ విషయాన్ని గమనించిన కార్తికేయ ఇందాక సినిమా విడుదల తేదీని నవంబర్ 24 వ తేదీన అని చెప్పానట క్షమించండి అని కార్తికేయ అన్నారు. వలిమై సినిమా ఫిబ్రవరి 24 వ తేదీన విడుదల అవుతుంది అని కార్తికేయ సరి చేసుకున్నాడు. ఇందాక ఏదో కన్ఫ్యూజన్ లో ఉన్నాను. నవంబర్ 24 వ తేదీన నా పెళ్లి రిసెప్షన్ అంటూ కార్తికేయ సరిచేసుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news