ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో భాగంగా అనేక అంశాలు చర్చకు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ పాలక పక్షమైన వైసీపీ ప్రతిపక్షమైన టీడీపీ మధ్య అనేక వాదోపవాదాలు కూడా జరుగుతున్నాయి. మొదటిరోజు పంట నష్టం బీమా గురించి సభలో పెద్ద గందరగోళం చెలరేగింది. రెండో రోజు టిడ్కో గ్రహాల గురించి గందరగోళం చెలరేగింది. ఈ రోజు ఏకంగా 11 బిల్లుకు సంబంధించిన చర్చ జరగాల్సి ఉంది.
ప్రస్తుతానికి పోలవరం అంశం మీద చర్చ జరుపుతున్నారు. ఇలా వాడివేడిగా సాగుతున్న సమయంలో ఒక వైసీపీ ఎమ్మెల్యే కు కరోనా పాజిటివ్ అని తేలడంతో అసెంబ్లీలో కరోనా కలకలం రేగింది. వైఎస్సార్సీపీకి చెందిన తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయన నిన్న కూడా సభలోనే ఉన్నారని తెలుస్తోంది. ఆయనకు ఈరోజు స్వల్పంగా కరోనా లక్షణాలు కనబడుతుంటే పరీక్ష చేయించుకోగా అందులో కరోనా పాజిటివ్ అని తేలింది దీంతో ఆయన హోం క్వారంటైన్ లో వెళ్లి చికిత్స పొందుతున్నట్లు సమాచారం.