ED కి దొరుకకుండా ఉండేందుకు 10 ఫోన్లు పగులగొట్టిన కవిత !

-

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో అమిత్‌ అరోరా అనే వ్యక్తిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు నిన్న అరెస్ట్‌ చేశారు. ఆయనను 14 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టును కోరుతూ… రిమాండ్‌ రిపోర్టును కోర్టుకు సమర్పించింది. ఏడు రోజులు రిమాండ్‌ ఇచ్చేందుకు కోర్టు అంగీకరించింది.

అయితే ఈ రిమాండ్‌ రిపోర్ట్‌లో పలు కీలక అంశాలను ఈడీ పేర్కొన్నారు.ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు ఉందని ఈడీ వెల్లడించింది. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను ఈడీ అధికారులు బయటపెట్టారు.

 

అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సౌత్ గ్రూప్ రూ.100 కోట్ల ముడుపులు చెల్లించిందని పేర్కొంది. అయితే ఈ కేసులో కీలక విషయాన్ని బయటపెట్టింది ఈడి. డేటా మరియు ఆధారాలు దొరకద్దు అని కవితకు సంబంధించిన 10 ఫోన్లు ధ్వంసం చేశారు అని ED పేర్కొంది. మొత్తం 17 ఫోన్లు కాగా, 10 ఫోన్లు కవితవే అని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news