రెండు గంటల్లోనే కాజీపేట టు విజయవాడ…!

-

కాజీపేట వాసులకు గుడ్‌ న్యూస్‌. ఇకపై కాజీపేట నుంచి విజయవాడకు రెండు గంటల్లోనే వెళ్లొచ్చు. కారులో వెళ్తే 5 గంటలు.. ఇప్పుడున్న ట్రైన్‌ రూట్‌లో వెళ్తే 4 గంటలు.. కానీ… రెండు గంటల్లోనే విజయవాడ చేరుకునేలా కొత్త రైలు మార్గాన్ని సిద్ధం చేసింది సౌత్‌ సెంట్రల్‌ రైల్వే‌. తాజాగా నిర్వహించిన కన్ఫర్మేషన్‌ ఆస్కిలోగ్రాఫ్‌ కార్‌ రన్‌ విజయవంతం కావడంతో.. మరికొన్ని రోజుల్లోనే ఈ మార్గం అందుబాటులోకి రానుంది.

ఇకపై కాజీపేట టు విజయవాడ… జర్నీ టైం కేవలం రెండు గంటలే. దీనికోసం కొత్త ప్రణాళిక సిద్ధం చేసిన దక్షిణమధ్య రైల్వే.. ఎట్టకేలకు సక్సెస్‌ అయ్యింది. కాజీపేట విజయవాడ మధ్య నిర్వహించిన కన్‌ఫర్మేటరీ ఆస్కిలోగ్రాఫ్‌ కార్‌ రన్‌ విజయవంతమైంది. 135 కి.మీ. గరిష్ఠ వేగంతో 24 బోగీలతో ఉదయం 10.30 గంటలకు కాజీపేటలో ప్రారంభమైన రైలు మధ్యాహ్నం 12.30 గంటలకు విజయవాడ చేరుకుంది.

ప్రస్తుతం కాజీపేట నుంచి విజయవాడకు మూడున్నర నుంచి నాలుగు గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం నడుస్తున్న రైళ్ల గరిష్ఠ వేగం గంటకు 110 కి.మీ, రాజధాని రైళ్ల వేగం మాత్రం 120 కి.మీ. అయితే, తాజాగా గంటకు 135 కి.మీ స్పీడ్‌ తో రన్‌ నిర్వహించారు. రైలు ఈ గరిష్ఠ వేగంతో వెళితే సికింద్రాబాద్‌ నుంచి కాజీపేటకు గంటన్నరలో చేరుకోవచ్చు. కాజీపేట నుంచి విజయవాడకు 2 గంటల్లో వెళ్లొచ్చని అధికారులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news