తెలంగాణ నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని 33 జిల్లాలకు ఉద్యోగుల ప్రక్రియ దాదాపుగా పూర్తయిన నేపథ్యంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల పని తీరు, ఖాళీల భర్తీ సహా ప్రభుత్వ కార్య క్రమాల అమలులో అన్ని స్థాయిల ఉద్యోగుల క్రియాశీల భాగస్వామ్యం తదితర అంశాలను అధ్యయనం చేసి.. సూచనలు ఇవ్వడానికి నలుగురు ఐఏఎస్ అధికారులతో సంస్కరణ కమిటీని ఏర్పాటు చేస్తూ.. సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ఐజీ అండ్ కమిషనర్ శ్రీ శేషాద్రి అధ్యక్షతన, సీఎం సెక్రటరీ శ్రీమతి స్మితా సభర్వాల్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, మహిళా శిశుసంక్షేమ శాఖ కమిషనర్ దివ్య సభ్యులుగా ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఆదివారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలోనే.. సీఎం కేసీఆర్ ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన చేశారు. ఇక ఈ కమిటీని అధ్యయనం చేసి.. ఖాళీలను గుర్తించనుంది.