కరోనా వైరస్ ఎవరినీ విడిచి పెట్టడం లేదు. ముఖ్యంగా సినీ నటీనటులను, రాజకీయ నాయకులపై కరోనా పంజా విసురుతుంది. ఇప్పటి కే దేశ వ్యాప్తంగా చాలా మంది రాజకీయ నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రులు కరోనా బారి న పడ్డారు. తెలంగాణ లోనూ రాజకీయ నాయకులకు కరోనా సోకింది. రేవంత్ రెడ్డి తో పాటు మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తో పాటు పలువురు కరోనా బారిన పడ్డారు. తాజా తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
తనకు స్వల్ప లక్షణాలు కనిపిస్తే.. కరోనా నిర్ధారణ పరీక్ష చేసుకున్నట్టు తెలిపారు. పరీక్ష ఫలితంలో కరోనా అని తెలిందని తెలిపారు. కాగ ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారని వివరించారు. వైద్యుల సూచనతో తన ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నట్టు ప్రకటించారు. కాగ ఇటీవల తనతో సన్నితంగా ఉన్న వారు కరోనా టెస్టులు చేసుకోవాలని విజ్ఞాప్తి చేశారు. అలాగే లక్షణాలు ఉన్న వారు క్వరైంటెన్ లో ఉండాలని కోరారు. అలాగే తను ఐసోలేషన్ నుంచి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలను కలుస్తానని అన్నారు. అలాగే అందరూ కూడా కరోనాతో జగ్రత్తగా ఉండాలని కోరారు.