టిఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ పార్టీ పెడుతున్నట్లు పత్రికల్లో వార్తలు వస్తున్నాయన్న ఆయన ఈ విషయంలో ఎవరూ కన్ఫ్యూజ్ కావొద్దు..స్పందించొద్దని అన్నారు. మనకు అలాంటి ఆలోచన లేదన్న ఆయన పార్టీ పెట్టే ఆలోచన ఉంటే బాజాప్తగా చెప్పే పెడుతామని అన్నారు. నయా భారత్, గియా భారత్ ఏదీ లేదు, దేశంలో ఎక్కడా లేనివిధంగా రెవెన్యూ చట్టాన్ని మన రాష్ట్రంలో తెస్తున్నామని అన్నారు.
ఎల్లుండే బిల్లు సభకు వస్తుందన్న ఆయన కూలంకషంగా చర్చిద్దామని అన్నారు. ఈ వచ్చిన తర్వాత భూ కబ్జాలు ఉండవని, గుండాయిజం, దాదాగిరి నడవదని అన్నారు. ఒక మంచి చట్టాన్ని తెచ్చుకోవడమే కాదు దాన్ని అంతే చక్కగా జనాల్లోకి తీసుకు వెళ్ళాలని ఆయన అన్నారు. దుబ్బాకలో మనం లక్ష మెజారిటీ తో గెలుస్తున్నా,మన్న ఆయన దుబ్బాక పై సోషల్ మీడియా లో అంత తప్పడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. అది యాంటీ సోషల్ మీడియా అని దాన్ని నమ్మొద్దని అన్నారు.