లిక్కర్ స్కాం గురించి కేసీఆర్ కు ముందే తెలుసు : ఈడీ

-

ఢిల్లీ హైకోర్టులో వాదనల సందర్భంగా లిక్కర్ స్కాంలో కేసీఆర్ పాత్ర గురించి ఈడీ విస్తుపోయే సంచలన విషయాలను బయటపెట్టింది.లిక్కర్ స్కాం గురించి కేసీఆర్ కు ముందే తెలుసని ఈడీ వెల్లడించింది.ఢిల్లీ మద్యం విధానం, రిటైల్ వ్యాపారం గురించి తండ్రి కేసీఆర్ తో ముందే వివరాలు కవిత చెప్పినట్లు ,ఢిల్లీలోని అధికారిక నివాసంలో కేసీఆర్ కు తన టీం సభ్యులను కవిత పరిచయం చేసిందని ఈడీ అధికారులు కోర్టు తెలిపారు.

ఆ తర్వాత కవిత తన టీంలో సభ్యులైన బుచ్చిబాబు, అరుణ్‌ పిళ్లై,అభిషేక్‌ బోయినపల్లి లను కేసిఆర్‌కు ఢిల్లీ నివాసంలో పరిచయం చేశారు. అదే సందర్బంలో… సమీర్‌ మహేంద్రును కేసిఆర్‌కు బుచ్చిబాబు పరిచయం చేశారు.అనంతరం కేసిఆర్‌ ఢిల్లీ మధ్యం విధానం, వ్యాపారం, పెట్టుబడులు, రిటైల్‌ వ్యాపారం పై సమీర్‌ మహేంద్రును కేసీఆర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. డబ్బులు ముట్టజెప్పిన విషయంతో పాటు కేసిఆర్‌తో భేటీ వివరాలను గోపి కుమరన్‌ తన వాగ్మూలంలో స్పష్టంగా రికార్డు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news