ఎన్కౌంటర్ తో తనను టార్గెట్ చేసిన వాళ్లకు సమాధానం చెప్పిన కెసిఆర్…!

-

ఎవరు ఎన్ని చెప్పినా సరే దిశ ఘటన ద్వారా… కెసిఆర్ ని రాజకీయంగా బలహీనపరిచే విధంగా కొన్ని శక్తులు చూసాయి అనేది వాస్తవం. జాతీయ మీడియాలో ఒక వర్గం ఆయన్ను టార్గెట్ చేసిన విధానం చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత దిశ ఘటనపై స్పందించడం మొదలుపెట్టిన ఆ వర్గం… ఆవేశంగా బల్లలు చరుస్తూ కెసిఆర్, ఆయన మంత్రి వర్గాన్ని విమర్శిస్తూ కాస్త పరిధి దాటి దేశభక్తుల మాదిరి ఊగిపోయింది. అంతర్జాతీయ స్థాయిలో దేశం పరువు పోయింది అనే వ్యాఖ్యలు చేసింది.

దేశంలో ఎన్నో ఘటనలు జరిగినా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఝార్ఖండ్ లో ముఖ్యమంత్రి ఇంటికి 10 కిలోమీటర్ల దూరంలో దారుణాలు జరిగినా ఆ స్థాయిలో ఊగిపోని ఆ వర్గం… కెసిఆర్ ని దుమ్మెత్తి పోసింది. ఇక పార్లమెంట్ లో కూడా దీనిపై చర్చ జరిగింది… దాన్ని కూడా హైలెట్ చేసింది జాతీయ మీడియా. ఇక్కడ కాస్త విషయం ఉన్న వాళ్లకు ఒకటి స్పష్టంగా అర్ధమైంది… ఈ ఘటనను కొన్ని శక్తులు రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి అని… హైదరాబాద్ లో జరుగుతున్న నిరసనలను పెంచి పోషించే అవకాశం ఉందనే వ్యాఖ్యలూ వినిపించాయి.

వాటికి కెసిఆర్ తన పని తీరుతోనే సమాధానం చెప్పారు… ఈ కేసులో కెసిఆర్ నుంచి ఇప్పటి వరకు ఒక్క మాట కూడా బయటకు రాలేదు. పార్లమెంట్ లో రక్షణ మంత్రి మాట్లాడినా… పదుల సంఖ్యలో ఎంపీలు నినదించినా సరే ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు. న్యాయం మాత్రం దిశ కి జరిగింది. ఆ న్యాయం ఏ విధంగా జరిగిందో అందరికి తెలుసు. ఇక్కడ కెసిఆర్ కొన్ని రాజకీయాలను చంపేశారు… అవును కెసిఆర్ అన్ని మందే ఊహించి జాగ్రత్త పడ్డారు. హడావుడి చేసిన కొన్ని శక్తులకు తన నిర్ణయంతో ఆయన సమాధానం చెప్పేశారు.

Read more RELATED
Recommended to you

Latest news