కేసీఆర్ ‘కారు’ రూట్ మారుస్తున్నారుగా!

-

అవసరాన్ని బట్టి, అవకాశాలని బట్టి రాజకీయం చేయడంలో కేసీఆర్‌ని మించిన వారు లేరనే చెప్పాలి..అసలు కేసీఆర్ రాజకీయం ఎప్పుడు ఒక అవసరం బట్టే ఉంటుందని చెప్పొచ్చు..ఏదో రాష్ట్రాన్ని మార్చేస్తా…దేశాన్ని మార్చేస్తానని చెబుతారు గాని..ఆ మాటల్లో కూడా తన రాజకీయ అవసరమే ఉంటుంది. కేసీఆర్ గురించి తెలిసిన వారికి ఈ విషయం బాగా తెలుసని చెప్పొచ్చు…ఇక ఇటీవల కూడా కేసీఆర్ దేశాన్ని మార్చేస్తానని తిరుగుతున్న విషయం తెలిసిందే…బీజేపీ పాలన వలన దేశం నాశనమైపోయిందని, తాను మళ్ళీ దేశాన్ని గాడిలో పెడతానని చెబుతున్నారు.

ఈ క్రమంలోనే దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలని కేసీఆర్ ఏకం చేసే పనిలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే మమతా బెనర్జీ, స్టాలిన్, అఖిలేశ్ యాదవ్, శరద్ పవార్, ఉద్ధవ్ థాకరే, దేవెగౌడ లాంటి నేతలకు టచ్‌లో ఉన్నారు…ఆల్రెడీ వారిని కలిసి బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. అయితే కేసీఆర్ కలిసిన వారంతా కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నవారే..అంటే కాంగ్రెస్ కూటమిని చీల్చి బీజేపీకి లబ్ది చేకూరేలా చేయాలని కేసీఆర్ చూస్తున్నారని, కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు.

అయితే ఇటీవల కేసీఆర్…కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం లేదు…పైగా ఈ మధ్య అసోం సీఎం..రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలని ఖండించి మద్ధతుగా నిలిచారు. ఇక అక్కడ నుంచి రాజకీయ పరిణామాలు మారిపోయాయి..ఈ క్రమంలోనే కేసీఆర్, కాంగ్రెస్‌కు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం మొదలైంది. కానీ కాంగ్రెస్ మాత్రం మళ్ళీ కేసీఆర్‌ని దగ్గర చేసుకోవడానికి చూడటం లేదు.

ఇక కాంగ్రెస్ నుంచి వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు కేసీఆర్ రూట్ మార్చానున్నారని తెలుస్తోంది…ఇప్పటివరకు కాంగ్రెస్‌కు అనుకూల పార్టీలని కలిసిన కేసీఆర్ ఇకపై బీజేపీ అనుకూల పార్టీలని కూడా కలిసేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది…ఈ క్రమంలోనే బీహార్ సీఎం నితిశ్ కుమార్‌ని కలవడానికి కేసీఆర్ రెడీ అయ్యారని సమాచారం. అలాగే జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌లని కలుస్తారని తెలుస్తోంది. చూడాలి మరి రానున్న రోజుల్లో కేసీఆర్ రాజకీయం ఎలా ఉంటుందో.

Read more RELATED
Recommended to you

Latest news