తెలంగాణ బిడ్డలకు.. తెలంగాణపై ఉండే ప్రేమ ఇతర ప్రాంతాల వారీకి ఉండదని పదేపదే సెంటిమెంట్ ను కేసీఆర్ రెచ్చగొట్టారని టీపీసీపీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు. దాదాపు 8 సంవత్సరాలు ప్రైవేటు సంస్థలు, ఎన్జీవో ఆర్గనైజేషన్లలో పనిచేసిన వ్యక్తి… అర్హత లేని వ్యక్తి సోమేష్ కుమార్ ను తీసుకుని అర్హత లేకున్నా ఛీప్ సెక్రటరీ హోదాను కల్పించావని ఆరోపించారు. ప్రభుత్వం ఉద్యోగం వదిలేసి పనిచేసిన వ్యక్తిని, సీనియారిటీ లేని సోమేష్ కుమార్ ను చీఫ్ సెక్రటరీ తీసుకున్నారని ఆరోపించారు. ఈ రాష్ట్రంలో దోపిడీలు, కొల్లగొట్టడానికి, జీఎస్టీకి, కేసీఆర్ కు కావాల్సిన వారికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడానికి సోమేష్ కుమార్ ను వినియోగిస్తున్నాడని.. ఆయన అధికార దుర్వనియోగానికి పాల్పడుతున్నాడని ఆరోపించారు. సాగునీటి పారుదల శాఖ అధికారి రజత్ కుమార్, మున్సిపల్ శాఖ అధికారి అరవింద్ కుమార్, కేటీఆర్ ఆత్మ జయేష్ రంజన్ అని, సందీప్ కుమార్ సుల్తానియా ఈయన దగ్గర ఎనిమిది శాఖలు ఉన్నాయని… వీరంతా బీహార్ చెందిన వారే అని.. బీహార్ అధికారులను కేసీఆర్ కోటరీగా పెట్టుకున్నారని విమర్శించారు. వీరంతా ముఠాగా ఏర్పడి తెలంగాణ పరిపాలనను గుప్పిట పెట్టుకుని, కేసీఆర్ దోపిడీకి సహకరిస్తున్నారని ఆరోపించారు. 157 మంది ఐఏఎస్ లలో తెలంగాణ అధికారులకు అన్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి అన్నారు.
బీహార్ అధికారులను కేసీఆర్ కోటరీగా పెట్టుకున్నాడు… రాష్ట్ర అధికారులకు అన్యాయం చేస్తున్నాడు- రేవంత్ రెడ్డి
-