బరాబర్ ఉన్నా… సీఎం మార్పు మీద కేసీఆర్ క్లారిటీ !

-

చాకా రోజులుగా ప్రచారం జరుగుతున్న సీఎం మార్పు అంశం మీద ఈరోజు కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. ఈరోజు తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అయింది. ఈ సమావేశంలోనే సీఎం మార్పు గురించి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తానే సీఎంగా ఉంటానన్న ఆయన ..నేను ఆరోగ్యం గానే ఉన్నానని తేల్చి చెప్పారు. అలానే కేటీఆర్ సీఎం అవుతున్నారనే వార్తలను పరోక్షంగా ప్రస్తావిస్తూ అసలు ఎందుకు అలా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.

అలానే సీఎం మార్పు గురించి ఇకపై ఎవరూ మాట్లాడవద్దన్న ఆయన రెండు నెలల పాటు ప్రతి జిల్లా తిరుగుతానని అన్నారు. అంతే కాక సీఎం మార్పు అంశంపై మాట్లాడవద్దని సమావేశంలో పలు మార్లు తేల్చి చెప్పిన కేసీఆర్, అయినా సరే ఎవరయినా మాట్లాడితే చర్యలు తప్పవని హెచ్చరికలు చేశారు. ఇక ఈ నెల12 నుండి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని, ప్రతి ఎమ్మెల్యే 50 వేల సభ్యత్వం నమోదు చేయించాలని ఆదేశించారు. మార్చ్ ఒకటి నుండి పార్టీ కమిటీల నియామకం ఉంట్నుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news