కేసీఆర్ కీలక నిర్ణయం… ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు 10 % రిజర్వేషన్

Join Our Community
follow manalokam on social media

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఇ.డబ్ల్యు.ఎస్. అంటే ఎకనమికల్లీ వీకర్ సెక్షన్ ) పదిశాతం రిజర్వేషన్ సౌకర్యం అమలు చేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. రెండు మూడు రోజుల్లోనే ఈ విషయంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, ఆదేశాలు జారీ చేయనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు.

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో పది శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కేసీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం రిజర్వేషన్లు పొందుతున్న వర్గాలకు తమ రిజర్వేషన్లను యథావిధిగా కొనసాగిస్తూనే రాష్ట్రంలో ఇ.డబ్య్యు.ఎస్. లకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించామని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో బలహీన వర్గాలకు 50 శాతం మేర రిజర్వేషన్లు అమలు అవుతున్నాయన్న ఆయన ఈ కొత్త ఇడబ్ల్యుఎస్ తో కలుపుకుని ఇకపై 60 శాతం రిజర్వేషన్లు అమలవుతాయని పేర్కొన్నారు.

TOP STORIES

ఖాతాదారులకు అలర్ట్‌ చేసిన ఎస్‌బీఐ

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తన వినియోగదారులకు ఆన్‌లైన్‌ యూపీఐ మోసాలు పట్ల అలర్ట్‌ చేసింది. ట్వీట్టర్‌...