కెసిఆర్ రైతులను నిండా ముంచారు – బండి సంజయ్

-

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మూడవ విడత ప్రజా సంగ్రామ యాత్ర నేటి నుంచి ప్రారంభమైంది. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కిషన్ రెడ్డితో యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి పాదయాత్రని ప్రారంభించారు బండి సంజయ్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బండి సంజయ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారో ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు బండి సంజయ్.

సీఎం హోదాలో కేసీఆర్ ఢిల్లీకి వెళితే షెడ్యూల్ ఉండదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో బిజెపి అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి అభ్యర్థి మొదట భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నాకే ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. ప్రతి బిజెపి కార్యకర్త ఉగ్ర నరసింహ స్వామి అవతారం ఎత్తి తెలంగాణ ప్రజలను, బిజెపి కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న ముఖ్యమంత్రి పై పోరాడాలని పిలుపునిచ్చారు.

నల్గొండ జిల్లా పోరాటాల పురిటి గడ్డ అన్నారు. నిరంకుశ నిజామును తరిమికొట్టిన గడ్డ నల్గొండ గడ్డ అని.. తెలంగాణ మలి ఉద్యమంలో ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసేలా చేసిన శ్రీకాంత చారికి జన్మనిచ్చిన గడ్డ ఈ నల్గొండ జిల్లా అన్నారు. ఇలాంటి పవిత్రమైన గడ్డ నుంచి మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news