ఏపీ లో ఎన్నికలు జరుగుతుంటే కే‌సి‌ఆర్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు .. ఎందుకో తెలుసా??

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల నగరం మోగటం తో అన్ని ప్రధాన పార్టీలు అలర్ట్ అయ్యాయి. ఎలాగైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో రాణించాలని ప్రతిపక్షాలు తీవ్రంగా కష్టపడుతున్నారు. మరోపక్క అధికార పార్టీ నాయకులు ఇతర పార్టీలకు చెందిన నాయకులను తమ పార్టీలోకి చేర్చుకుని వార్ వన్ సైడ్ చేసుకోడానికి అనేక కుయుక్తులు పన్నుతున్నారు. కాగా ఈ నెల 12వ తేదీ నుంచి 29వ తేదీ వరకు అనగా దాదాపు 18 రోజుల పాటు మద్యం అమ్మకాలను ఏపీలో  బంద్ చేయడం జరిగింది. Image result for kcr happyదీంతో ఏపీ లో ఉన్న మందుబాబులు పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మద్యం కొనుక్కోడానికి రెడీ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహిస్తుండటంతో ఖచ్చితమైన సమయాన్ని బట్టి మాత్రమే అమ్మకాలు జరుగుతున్నాయి. దీంతో చాలామంది నిలబడలేక ఎక్కువగా రాష్ట్ర బోర్డర్ తెలంగాణ రాష్ట్రంలో మద్యం విక్రయించడానికి ఎక్కువగా మొన్నటివరకు ఆసక్తి చూపారు.

 

తాజాగా ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రం మొత్తం మద్యం షాపులు బంద్ చేస్తున్న తరుణంలో…పక్కనే ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళితే రాష్ట్రంలో ఉన్న మెజారిటీ మందుబాబులు ఎక్కువగా తెలంగాణ బోర్డర్ సమీపంలో ఉన్న మందు షాపుల దగ్గర, ఎక్కువ మద్యం విక్రయించే అవకాశం ఉండటంతో పాటు తెలంగాణ ఆదాయం కూడా పెరుగుతుందన్న భావనలో కేసీఆర్ హ్యాపీగా ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి. 

Read more RELATED
Recommended to you

Latest news