కేసీఆర్ జనరేటర్లతో సభలు పెట్టి.. కరెంట్ పోయిందంటూ దుష్ప్రచారం : శ్రీధర్ బాబు

-

కాంగ్రెస్ ప్రభుత్వం, టిఆర్ఎస్ పార్టీ ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు.తాజాగా బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్పై మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేసీఆర్ జనరేటర్లతో సభలు పెట్టి.. కరెంట్ పోయిందంటూ దుష్ప్రచారం చేస్తు న్నారని మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎంజీఎంలో కరెంట్ పోయిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.రికార్డు స్థాయిలో వినియోగం పెరిగినా విద్యుత్ సప్లయ్ చేశామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. బీఆర్ ఎస్ పాలనలోనే ఎంజీఎం లో ఎలుకలు షేషంట్ల కాళ్లు కొరికిన విషయం మరిచిపోయారా అని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు.

పరిపాలనను గాడిన పెట్టే పనిలో కాంగ్రెస్ ఉందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. బీఆర్ ఎస్ ప్రభుత్వం చేసిన పొరపాట్లు మేం చేయకుండా ముందుకెళ్తున్నామన్నారు. మేడిగడ్డపై విపక్షాలను కూడా సలహాలు ఇవ్వాలని కోరామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news