ఏపీలో ఎన్డీఏ కూటమిదే అధికారం : అమిత్ షా

-

ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు ఇటీవల ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. దీంతో జూన్ 4న వెలువడే ఫలితాలపై స్టేట్ పాలిటిక్స్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో ఏ పార్టీకి మెజార్టీ సీట్లు వస్తాయి..? ఎవరు ముఖ్యమంత్రి అవుతారు..? అన్న చర్చలు రాజకీయ పార్టీలతో పాటు సామాన్య ప్రజల్లో మొదలయ్యాయి. ఈ క్రమంలో ఏపీ ఎన్నికల ఫలితాలపై బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా నేషనల్ మీడియా పీటీఐకు అమిత్ షా ఇంటర్య్వూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.

ఏపీలో ఎన్డీఏ కూటమి 17 ఎంసీ స్థానాలు గెలుస్తోందని అభిప్రాయం వ్యక్తం చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి పట్ల సంతృప్తితో ఉన్నారని అన్నారు. ఏపీలో ఎన్డీఏ కూటమి అలాగే ఆంధ్రప్రదేశ్ పొరుగు రాష్ట్రం ఒడిషాలోనూ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఏపీ, కర్నాటకలో కాంగ్రెస్ రాజ్యాంగానికి విరుద్ధంగా మతపరమైన ముస్లిం రిజర్వేషన్లు అమలు చేసిందని ఫైర్ అయ్యారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చాక రాజ్యాంగానికి వ్యతిరేకమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి.. ఓబీసీల రిజర్వేషన్లను కాపాడుతామని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news