మతం క్యాన్సర్ కంటే ప్రమాదమని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు సీఎం కేసీఆర్. మతం, కులం పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని.. అన్ని కులాలు, మతాలను ఆదరించే దేశం మనదని వెల్లడించారు. శాంతి భద్రతలు బాగుంటే పెట్టుబడులు, ఉద్యోగాలు వస్తాయన్నారు సీఎం కేసీఆర్. కులం, మతం పేరుతో గొడవలు జరిగితే ఎవరూ రారని.. గొడవ పడితే మన కాళ్లు మనమే నరుక్కున్నట్లు అవుతుందని తెలిపారు.
దేశంలో వింత రాజకీయాలు మొదలయ్యాయని.. దేశంలో కొన్ని రాష్ట్రాల్లో పూలు కొనవద్దు, అవ్వి కొనవద్దు అంటున్నారు.దేశంలో ఇలాంటి పరిస్థితి దాపురించింది ప్రజలు దీన్ని గమనించాలన్నారు. హైదరాబాద్ అనేక పెద్ద పెద్ద ప్రపంచ స్థాయి కంపెనీలు నెలకొల్పారని.. శాంతి భద్రతల విషయంలో కరెక్ట్ లేకపోతే పెద్ద పెద్ద కంపెనీ లు వస్తాయా రావని వెల్లడించారు. ఇలాంటి వాటిని తిప్పికొట్టేందుకు మనము అందరం సమాయత్తం కావాలని.. దేశంలో తలసరి ఆదాయంలో చాలా ముందు వరుసలో ఉన్నామన్నారు. 2016 రూపాయల పెన్షన్ మనం తప్ప ఎక్కడ లేదని.. ప్రధాన మంత్రి మోడీ స్వంత రాష్ట్రంలో సైతం ఇంత పెన్షన్ ఇవ్వడం లేదని చురకలు అంటించారు.