Keerthy Suresh: పాతిక మందిని చంపేసిన కీర్తిసురేశ్..మర్డర్‌లో సాయం చేసిన డైరెక్టర్!

-

‘మహానటి’ కీర్తి సురేశ్ డీ గ్లామర్ రోల్ ప్లే చేస్తున్న ఫిల్మ్ ‘సాని కాయిధమ్’. ఈ పిక్చర్ తెలుగులో ‘చిన్ని’గా విడుదలవులోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో OTT ఒరిజినల్ గా వస్తున్న ఈ మూవీ ట్రైలర్ ను మంగళవారం మేకర్స్ విడుదల చేశారు.

ట్రైలర్ చూస్తే..కీర్తి సురేశ్ కు ఈ సారి మరో నేషనల్ అవార్డు గ్యారంటీ అనే మాదిరిగా పర్ఫార్మ్ చేసింది. రివెంజ్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో డైరెక్టర్ సెల్వరాఘవన్ నటుడిగా కనిపించారు. ఆయన స్క్రీన్ ప్రజెన్స్ నెక్స్ట్ లెవల్ లో ఉండబోతున్నది.

‘సంగయ్య’ అనే పాత్ర పోషించిన సెల్వరాఘవన్..సినిమాలో పొన్ని (చిన్ని)కి ఏ విధంగా సాయం చేశాడు? పోలీస్ కానిస్టేబుల్ గా పని చేసిన కీర్తి సురేశ్ పాతిక మర్డర్స్ ఎందుకు చేసింది? ఇంట్రెస్టింగ్ స్టోరిగా ఉండబోతున్నది. వచ్చే నెల 6 నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. మేకర్స్ తాజాగా విడుదల చేసిన ‘సాని కాయిధమ్(చిన్ని)’ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

కీర్తి సురేశ్ నటించిన మరో సినిమా కూడా వచ్చే నెలలో వస్తుండటం విశేషం. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుకు జోడీగా నటించిన ‘సర్కారు వారి పాట’ పిక్చర్ వచ్చే నెల 12న విడుదల కానుంది. ఈ సినిమాపైన కూడా బోలెడన్ని ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ అందించారు.

https://www.instagram.com/tv/Cczl6H-Jdzk/?utm_source=ig_web_copy_link

Read more RELATED
Recommended to you

Latest news