ముందస్తుకు మూడేళ్లు..’కారు’లో జోరు ఏది?

-

రాజకీయ వ్యూహాలు పక్కాగా అమలు చేసి సక్సెస్ అవ్వడంలో కేసీఆర్ తోపు లీడర్ అనే చెప్పాలి. ఆయన ఏదైనా వ్యూహం వేస్తే ప్రత్యర్ధులు చిత్తు అవ్వాల్సిందే. ఇక ఆయన కీలక వ్యూహాల్లో ఒకటి ముందస్తు ఎన్నికలు. అసలు అనూహ్యంగా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళి ఎలా గెలిచారనే విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్రం విభజన జరిగాక…2014లో జరిగిన ఎన్నికల్లో బొటాబొటి మెజారిటీతో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత ఇతర పార్టీ ఎమ్మెల్యేలని లాగేసుకుని పార్టీని బలోపేతం చేశారు.

TRS-Party | టీఆర్ఎస్
TRS-Party | టీఆర్ఎస్

ఇంతవరకు అంతా బాగానే ఉంది..మామూలుగా మళ్ళీ తెలంగాణ అసెంబ్లీకి 2019లో ఎన్నికలు జరగాలి. కానీ కేసీఆర్ అనూహ్యంగా..ముందస్తుకు వెళ్ళిపోయారు. 2018 సెప్టెంబర్‌లోనే ఈ ముందస్తుకు ఆలోచన చేశారు. కానీ ప్రత్యర్ధులు ముందస్తు ఊహించలేదు. ప్రత్యర్ధులు అలెర్ట్‌గా లేని సమయంలోనే కేసీఆర్ ఊహించని స్టెప్ వేశారు. వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేయడం..ఎన్నికలకు వెళ్లిపోవడం జరిగాయి. ఈ ప్రక్రియ అంతా వెంటవెంటనే జరిగిపోయింది.

దీంతో ప్రత్యర్ధి పార్టీలు కొలులేకపోయాయి. పైగా కాంగ్రెస్-టీడీపీలు పొత్తు పెట్టుకోవడం కేసీఆర్‌కు బాగా కలిసొచ్చింది. మళ్ళీ సెంటిమెంట్‌తో అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకుని అధికారంలోకి వచ్చేశారు. కరెక్ట్‌గా 2018 డిసెంబర్ 7న ఎన్నికలు జరిగాయి….11న ఫలితాలు వచ్చాయి..13న ఎన్నికల ప్రక్రియ ముగిసింది. అంటే కరెక్ట్‌గా టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయింది.

అయితే మూడేళ్లు పూర్తి అయిన సందర్భంగా ఎక్కడా కూడా టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకోలేదు. అసలు ఏ నేత కూడా మూడేళ్ళ పాలన గురించి ఒక్క మాట మాట్లాడలేదు. అటు కేసీఆర్ ఏమో..తమిళనాడు పర్యటనలో ఉన్నారు. ఇటు కేటీఆర్ గానీ, హరీష్‌లు గానీ మూడేళ్ళ పాలనపై ఏ మాత్రం స్పందించలేదు. అంటే తమ పాలనపై ప్రజలకు అసంతృప్తి ఉందని చెప్పి నేతలు స్పందించలేదా? లేక నెక్స్ట్ ఎలా అధికారంలోకి రావాలనే ఆలోచనతో ఉన్నారా? అనేది తెలియడం లేదు. కానీ ప్రజల్లో అసంతృప్తి ఉందని మాత్రం అర్ధమవుతుంది..అందుకే కారులో జోరు లేదు.

Read more RELATED
Recommended to you

Latest news