ఆ విషయమై కేసీఆర్ ఒక మాట, కేటీఆర్ మరొక మాట.. పబ్లిక్ ఏమంటున్నారంటే..

-

టీఆర్ఎస్ ప్రభుత్వం ఇళ్లు లేని నిరుపేదల కోసం రూపొందించిన చక్కటి పథకం ‘డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ’. ఈ పథకం కోసం రాష్ట్ర ఆవిర్భావం నుంచి అర్హులైన వారు ఎదురు చూస్తూనే ఉన్నారు. కొందరికి ఇప్పటికే ఇళ్లు పంపిణీ చేసినట్లు గులాబీ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేదల్లో అర్హులను గుర్తించి వారికి ఇళ్లు అందజేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. కాగా, ఈ ప్రతిష్టాత్మక పథకం విషయంలో ముఖ్యమంత్రి మాటలు ఒకలా ఉండగా, ఆయన కుమారుడి మాటలు మరోలా ఉన్నాయి. దీంతో పబ్లిక్ రియాక్షన్ వేరేలా ఉంది. ఇంతకీ వారు ఏం మాట్లాడారంటే..

cm kcr | సీఎం కేసీఆర్
cm kcr | సీఎం కేసీఆర్

‘డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ’ అనేది అత్యంత పారదర్శకంగా ఉండబోతున్నదని, ప్రజా ప్రతినిధుల జోక్యం ఇందులో ఉండబోదని సీఎం కేసీఆర్ గతంలో పేర్కొన్నారు. లాటరీ పద్ధతిలో ఆఫీసర్లు లబ్ధిదారులను ఎంపిక చేసి, వారికి ఇళ్లను అందజేస్తారని వివరించారు. దాంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అర్హులైన నిరుపేదలు తమకు ‘డబుల్’ ఇళ్లు వస్తాయని అప్లికేషన్స్ చేయడంతో పాటు ఇళ్లపై ఆశలు పెంచుకున్నారు. అయితే, ఇటీవల కాలంలో ఈ ఇళ్ల విషయమై మంత్రి కేటీఆర్ భిన్న వ్యాఖ్యలు చేశారు. ప్రమాదాల్లో చనిపోయిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో ఇళ్లు లేని కుటుంబాలకు ‘డబుల్’ ఇళ్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. ఇందుకుగాను స్థానిక ప్రజాప్రతినిధులు పని చేస్తారని, వారిదే ఆ బాధ్యత అని చెప్పాడు.

దాంతో అర్హులైన నిరుపేదల్లో ఈ ఇళ్ల పంపిణీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి ఎలాంటి పైరవీలు ఉండబోవని పేర్కొంటుంటే, ఆయన తనయుడు టీఆర్ఎస్ నేతలు పెత్తనం ఉంటుందని వ్యాఖ్యానించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అర్హులైన తాము దరఖాస్తు చేసుకున్నా ఇంతవరకు రాలేదని, కానీ, టీఆర్ఎస్ పార్టీ వారికి అప్లికేషన్ ఎలా ఇళ్లు మంజూరు చేస్తారని పబ్లిక్ నుంచి విమర్శలు వస్తున్నాయి. అర్హులైన నిరుపేదలకు ఒక న్యాయం, టీఆర్ఎస్ పార్టీ వారికి ఇంకో న్యాయం ఎక్కడిది? అంటూ ప్రశ్నలు జనం నుంచి వస్తున్నాయి. ‘డబుల్’ ఇళ్ల పంపిణీపై నేతలకే ఓ క్లారిటీ లేదని అర్థమవుతుందంటూ కొందరు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news