తెలంగాణకు మీరు కూడా సహాయం చెయ్యాలని భావిస్తున్నారా..?

-

కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి తెలంగాణా ప్రభుత్వంకి ప్రతీ ఒక్కరు సహాయం చేస్తున్నారు. పారిశ్రామిక వేత్తలు సహా పలువురు ప్రభుత్వానికి సహాయం చేయడానికి ముందుకి వచ్చారు. సిని ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు ఇలా ప్రతీ ఒక్కరు కూడా సహాయం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, చిరంజీవి, పారిశ్రామిక వేత్త మేఘా కృష్ణా రెడ్డి ఇలా అందరూ సహాయం చేస్తున్నారు.

కోట్ల రూపాయల్లో తమ సహాయం ప్రకటిస్తున్నారు. ఇక సామాన్యులు కూడా సహాయం చేయడానికి ముందుకి వస్తున్నారు. రైతులు కూడా సహాయం చేయడం గమనార్హం. తెలంగాణా ప్రభుత్వ ఉద్యోగులు కూడా ప్రభుత్వానికి సహాయం చేయడానికి భారీ ఎత్తున విరాళాలు ఇచ్చారు. ఇక పోలీసు అధికారులు, రిటైర్ అయిన ఉద్యోగులు కూడా సహాయం చేయడానికి ముందుకి వచ్చి ప్రభుత్వానికి అండగా నిలబడ్డారు.

ప్రజా ప్రతినిధులు కూడా ప్రభుత్వానికి తమ వంతు సహాయ౦ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి చేయూతగా నిలవాలనుకుంటున్నారా? కరోనా కట్టడికి మీ వంతు సహాయం చేద్దామనుకుంటున్నారా? మీరు కూడా ప్రభుత్వానికి సహాయం చేయవచ్చు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో విరాళాలు అందజేసేందుకు వీలుగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఆన్‌లైన్‌లో విరాళాలు ఇవ్వాలనుకుంటే..

కోవిడ్19(https://ts.meeseva.telangana.gov.in/Covid/CovidContribution.htm), A/C Name : CM RELIEF FUND, TELANGANA STATE

Account No. 62354157651
IFSC Code : SBIN0020077 (Current Account)
SBI, Secertariat Branch,Hyderabad

Read more RELATED
Recommended to you

Latest news