అమిత్ షాతో కేసీఆర్ భేటీ.. చర్చించే అంశాలివే

టీఆర్ఎస్ భవనానికి భూమిపూజ చేయడానికి ఢిల్లీ పయనమైన కేసీఆర్, ఈ రోజు హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఈ భేటీలో చాలా అంశాలు చర్చకు రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన విషయాల్లో పెండింగ్ ఉన్న అంశాలను అమిత్ షాకి వివరించనున్నారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నడుస్తున్న క్రిష్ణా నదీ జల వివాద విషయాలు చర్చించనున్నారు. అంతేకాదు, ఇంకా తెలంగాణలో ఐపీఎస్ క్యాడర్ పోస్టులు పెంచాలని కోరనున్నారు.

139పోస్టుల నుండి 194పోస్టుల వరకు పెంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి అమిత్ షాను కోరనున్నారు. ఇంకా, రాష్ట్ర పోలీస్ కేడర్ లో మార్పులు, చేయాల్సిన పనులు మొదలగు అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్ళనున్నారు. అదీగాక కేంద్రం గెజిట్, కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటుపై చర్చించనున్నారు. మరి ఈ భేటీలో ఇంకా ఏమేం విషయాలు రానున్నాయో చూడాలి.