నేడు సీఎం స్టాలిన్ తో కేసీఆర్ భేటీ.. జాతీయ రాజకీయాలపైనే చర్చ !

తమిళనాడు పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు… ఇవాళ ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ తో సమావేశం కానున్నారు. ఇవాళ తిరుత్తని లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. ఈ భేటీకి స్టాలిన్ నివాసంలో ఇవాళ సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య జరగనున్నట్లు సమాచారం అందుతోంది.

ఈ సందర్భంగా… జాతీయ రాజకీయాలు, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు, బిజెపి ప్రభుత్వాని కి వ్యతిరేకంగా ఎలాంటి అడుగులు వేయాలి… అనే అంశాలపై ఇరు రాష్ట్రాల ముఖ్య మంత్రులు చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. జాతీయ రాజకీయాల పైకి చర్చించేందుకే ప్రత్యేకంగా సీఎం కేసీఆర్ ఈ తమిళనాడు టూర్ పెట్టుకున్నారని కూడా తెలుస్తోంది. కాగా నిన్న సాయంత్రం కుటుంబ సమేతంగా సీఎం కేసీఆర్ తమిళనాడు కు చేరుకున్నారు. తమిళనాడులోని శ్రీ రంగ పట్టణం చేరుకున్న కేసీఆర్ కుటుంబానికి తమిళనాడు అధికారులు, మంత్రులు ఘన స్వాగతం పలికారు.