ఉంటే ప్రగతిభవన్ లేదంటే ఫామ్‌హౌస్ అన్నట్టు సీఎం కేసీఆర్‌కు మొన్నటి వరకు ఓపేరుండేది. రాష్ట్రంలో ఏం జరిగినా ఆయన బయటకు రారని, ఎవరినీ పరామర్శించరని ఎప్పటి నుంచో ప్రతిపక్షాలు, నెటిజన్లు, ఉద్యమకారులు విమర్శించేవారు. ఇప్పుడు కరోనా సమయంలో ఆయన గతేడాదిగా ఎక్కడికీ వెళ్లలేదు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఎప్పుడు వెళ్లి పరిశీలించలేదు.
ఇప్పుడు సెకండ్ వేవ్‌లో దక్షిణాది రాష్ట్రాల సీఎంలు ఆస్పత్రులకు వెళ్లి వసతులు పరిశీలిస్తున్నారు. అవసరమైన చర్యలన్నీ తీసుకుంటూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఈ ఎఫెక్ట్ సీఎం కేసీఆర్‌పై పడింది.
ఇంకోవైపు ఈటలను బర్తరఫ్ చేసినప్పటి నుంచి ఆయనపై విమర్శలు పెరిగాయి. వీటన్నింటికీ చెక్ పెట్టాలని సీఎం తొలిసారి గాంధీ ఆస్పత్రికి వెళ్లారు. పీపీఈ కిట్లు లేకుండానే కరోనా వార్డుల్లో తిరిగి పేషెంట్ల సమస్యలు తెలుసుకున్నారు. రెండో రోజు వరంగల్‌లోని ఎంజీఎం, సెంట్రల్ జైలులో పరిశీలించారు. అక్కడ కూడా పీపీఈ కిట్లు వేసుకోలేదు. దీంతో ఆయనపై సోషల్ మీడియాలోకొంత పాజిటివ్ వేవ్ కనిపిస్తోంది. ప్రజలకు ధైర్యం చెప్పేందుకే పీపీఈ కిట్లు పెట్టుకోకుండా వెళ్లారంటూ కొనియాడుతున్నారు. ఇలాగే ఇతర జిల్లాల్లోని ఆస్పత్రులను కూడా విజిట్ చేయాలని మరికొందరు కోరుతున్నారు. మొత్తానికి కేసీఆర్ ప్లాన్ వర్కౌట్ అయిందనే చెప్పాలి.