కోకాపేట భూముల అమ్మ‌కానికి కేసీఆర్ స‌ర్కార్ గ్రీన్ సిగ్న‌ల్‌

హైద‌రాబాద్ లోని కోకాపేట్ భూముల అమ్మ‌కానికి కేసీఆర్ స‌ర్కార్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. కోకాపేట్ నియో పోలీస్ లోని భూముల వేలానికి హెచ్ ఎండీఏ కు తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం అనుమ‌తి ఇస్తూ.. నిర్ణ‌యం తీసుకుంది. 239, 240 స‌ర్వే నంబ‌ర్ల లోని భూమి పై హ‌క్కులు పూర్తి గా ప్ర‌భుత్వానివేన‌ని నిర్ధార‌ణ అయింది.

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ ఏజెంట్ గా హెచ్ ఎండీఏ భూముల ఈ వేలం నిర్వ‌హించింద‌న్న ప్ర‌భుత్వం… వేలంలో.. భూములు కొన్న బిడ్డ‌ర్ల కు రిజిస్ట్రేష‌న్లు చేయాల‌ని రంగారెడ్డి.. క‌లెక్ట‌ర్ కు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేర‌కు సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఐటీ కారిడార్ లోని కోకా పేట్ లో ప్ర‌భుత్వ భూముల అమ్మ‌కానికి ఈ ఏడాది జులై లో ఆన్ లైన్ లో నిర్వ‌హించిన వేలం కార్య‌క్ర‌మానికి రిల‌య్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి విప‌రీత‌మైన డిమాండ్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇక ఈ సారి కూడా ఈ భూములు భారీగా ధ‌ర ప‌లుక‌నున్నాయి.