వీధి వ్యాపారులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త.. వారి ఖాతాల్లో రూ.20 వేలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుతో దూసుకు పోతోంది. ఇప్పటికే అన్ని రంగాల వారికి.. ఆర్థిక సహాయం అందేలా సంక్షేమ పథకాలను తీసుకువచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే తాజాగా వీధి వ్యాపారులకు శుభ వార్త చెప్పింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. గతంలో.. వీధి వ్యాపారులకు ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయం తీసుకున్న సర్కారు.. ఇప్పటికే మొదటి విడతలో చాలామందికి 10 వేల రూపాయలను అందించింది.

kcr
kcr

పూర్తిస్థాయిలో రుణాలు చెల్లించిన వీధి వ్యాపారులకు రెండో విడత రుణాలు కూడా ఇవ్వాలని ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. తొలి దశలో 10 వేల రుణం చెల్లించిన వారికి ఈ రెండో విడత లో 20 వేల రూపాయల వరకు ఇవ్వాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా రుణం ఇవ్వడం ద్వారా వీధి వ్యాపారులు ఆర్థికంగా బలపడతారని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ఈ ప్రక్రియ ద్వారా మున్సిపాలిటీలకు కూడా ఆదాయం చేకూరే చాన్స్ ఉంది. ఇక ఈ రుణాలు కావలసినవారు మీ సేవ కేంద్రాలు, మున్సిపల్ ఆఫీస్, ఫోన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు.