మునుగోడులో ఉచిత చేప పిల్లలను వదిలిన కేసీఆర్ సర్కార్

-

నల్లగొండ జిల్లా మునుగోడు (మం)కిష్టాపురం గ్రామంలో గొర్రెలకు, పశువులకు, వ్యాక్సినేషన్ ను ప్రారంభించి, అనంతరం పెద్ద చెరువులో ఉచిత చేప పిల్లలను వదిలారు తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి, పాల్గొన్న MP బడుగుల లింగయ్య యాదవ్. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణా ఉద్యమ నాయకుడే రాష్ట్రానికీ ముఖ్యమంత్రి కావడం మన అదృష్టం..24గంటల విద్యుత్, తాగు, సాగు నీరు ప్రజలకు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసిఆర్ దేన్నారు.

కొందరు మూర్కులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతారు.. కానీ జరుగుతున్న అభివృద్ధికి ప్రజలే సాక్ష్యమని.. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మునుగోడు కు ఎమ్ చేశారో కేంద్ర హోం శాఖ మంత్రి మునుగోడు సభలో ఎందుకు చెప్పలేకపోయారని విమర్శించారు. యాదాద్రి పునర్నిర్మాణం చేసిన గొప్ప వ్యక్తి కేసిఆర్ అని.. రాజీనామా చేస్తే అభివృద్ధి జరుగుతుందని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

మొత్తం తెలంగాణా భుబాగం నాదే అనుకొని అభివృద్ధి చేస్తుంది తెలంగాణా ప్రభుత్వము… విద్యా, వైద్యంలో అద్భుత ప్రగతి సాధించింది తెలంగాణ అన్నారు. రాష్ట్రంలోని జరుగుతున్న అభివద్ధి, సంక్షేమం ఎవరూ రాజీనామా చెస్తే జరగడంలేదు.. కేవలం ముఖ్యమంత్రి ముందుచూపు వల్లే సాధ్యం అవుతుంది… మునుగోడు కు వస్తున్న కొందరు నేతలు అవాక్కులు, చేవాక్కులు మాట్లాడుతున్నారు. వారికీ మునుగోడు ప్రజలు గట్టిగా సమాధానం చెప్పాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news