మతోన్మాద శక్తుల నుంచి మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం : కేసీఆర్

-

కొన్ని మతతత్వ శక్తులు తెలంగాణలో అశాంతిని సృష్టించేందుకు కుట్ర చేస్తున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆనాడు చిన్న ఏమరుపాటు వల్ల 58 ఏళ్లు ఎంతో నష్టపోయామని గుర్తుచేశారు. ఇప్పుడు అది పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. మతోన్మాద శక్తుల నుంచి మరోసారి జాగ్రత్తపడాల్సిన అవసరముందని పేర్కొన్నారు.

చరిత్రను వక్రీకరించి తెలంగాణను మలినం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. రెప్పపాటు కాలం ఆదమరిచినా… విచ్ఛిన్నకర శక్తుల నుంచి ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. తెలంగాణ నేలపై నెలకొన్న ప్రశాంత వాతావరణానికి విఘాతం కలగనీయొద్దని సూచించారు. మతోన్మాద శక్తుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు.

హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. పబ్లిక్ గార్డెన్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అమరవీరుల స్మారకం వద్ద నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ విమోచనం.. నిజాం చెర నుంచి విముక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాట యోధులు చేసిన త్యాగాల గురించి ప్రసంగించారు. 75 ఏళ్లలో హైదరాబాద్ ప్రాంతం, ఎనిమిదేళ్లలో తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధి గురించి మాట్లాడారు.

Read more RELATED
Recommended to you

Latest news