చాలా మంది జుట్టు రాలిపోవడం వలన ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నట్లైతే ఈ చిట్కాలు మీకోసం. ఈ డ్రింకులను తీసుకుంటే జుట్టు రాలడం తగ్గుతుంది. అలానే జుట్టు ఒత్తుగా ఎదుగుతుంది. అందమైన కురులుని ఈ డ్రింకులతో పొందొచ్చు. పైగా ఇవి తాగడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిదే.
క్యారెట్ జ్యూస్:
జుట్టు రాలిపోతున్నట్లయితే క్యారెట్ జ్యూస్ తాగుతూ ఉండండి. దీనివల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. క్యారెట్లో విటమిన్ ఏ విటమిన్ ఈ ఎక్కువగా ఉంటాయి. దీంతో ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.
ఆమ్లా జ్యూస్:
ఆమ్లా జ్యూస్ కూడా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది. ఆమ్లా జ్యూస్ తాగడం వల్ల కొత్త కణాలు ఏర్పడేటట్టు చేస్తుంది. ఆయుర్వేద వైద్యంలో కూడా ఉసిరిని ఎక్కువగా వాడతారు దీని వల్ల అద్భుతమైన లాభాలు పొందొచ్చు.
అలోవెరా జ్యూస్:
అలోవెరా జ్యూస్ కూడా బాగా ఉపయోగపడుతుంది. కలబంద జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకుంటే జుట్టు చిట్లిపోవడం తగ్గుతుంది. చుండ్రు దురద సమస్యలు కూడా ఉండవు. జుట్టు అందంగా సిల్కీ గా ఉంటుంది.
కివి జ్యూస్:
కివి జ్యూస్ కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది కురుల అందాన్ని ఇది పెంపొందిస్తుంది. అందమైన నాణ్యమైన జుట్టును పొందడానికి సహాయం చేస్తుంది.