ఈరోజు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ రోజు ఉదయం ఆయన అధికారులతో ఈ సమావేశంలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ పై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ధరణి పోర్టల్ రూపకల్పన కోసం ఎప్పుడైతే ఒక ప్రకటన చేశారో అప్పటి నుండి రిజిస్ట్రేషన్లు అన్ని స్తంభించిపోయాయి. సుమారు 40 రోజుల తర్వాత వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ మొదలైనా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ మాత్రం ఇంకా మొదలుకాలేదు.
ఈ వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ లో అనేక సాంకేతిక సమస్య ఏర్పడడంతో అనుకున్న దాని కంటే ఇంకా ఇంకా ఆలస్యం అవుతోంది. ఇక వీలైనంత త్వరగా దీన్ని అందుబాటులోకి తీసుకురావడం కోసం ఈ రోజు ఆయన కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి ? మొదలు పెట్టడానికి సాంకేతికంగా ఎలా సిద్ధం కావాలి ? ఎలా పోర్టల్ రూపొందిస్తే బాగుంటుంది అనే అనేక కీలక అంశాలను ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.