మళ్ళీ మొదలు..కేసీఆర్ గేమ్ స్ట్రాటజీ మార్చారా?

-

మరొకసారి తెలంగాణలో గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ అన్నట్లు వార్ మొదలైంది. చాలా కాలం నుంచి కేసీఆర్ సర్కార్‌కు, గవర్నర్ తమిళిసైల మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. గవర్నర్‌కు ప్రోటోకాల్ ఇచ్చే విషయంలో కే‌సి‌ఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంటే ..కే‌సి‌ఆర్ ప్రభుత్వం పంపించే కొన్ని బిల్లులని గవర్నర్ పెండింగ్ లో పెడుతున్నారు. వాటికి ఆమోదముద్ర వేయడం లేదు. అయితే ఇలా వార్ నడుస్తుండగానే..ఇటీవల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కే‌సి‌ఆర్ ప్రభుత్వం..గవర్నర్‌ని ఆహ్వానించి..బడ్జెట్ ప్రసంగం చేయించారు.

దీంతో గవర్నర్, గవర్నమెంట్ ల మధ్య ఉన్న అంతరయుద్ధం తగ్గిపోయిందని అంతా అనుకున్నారు. అయితే సమస్య సద్దుమణిగింది అనుకునేలోపు..కొన్ని బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేయకపోవడంపై తెలంగాణ సి‌ఎస్ సుప్రీం కోర్టు తలుపులు తట్టారు. అసెంబ్లీలో ఆమోదించి పంపిన బిల్లులకు గవర్నర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టారంటూ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇప్పటి వరకూ పది బిల్లులు పెండింగ్‌లో పెట్టారని, గత ఏడాది సెప్టెంబరు నుంచి ఏడు బిల్లులు పెండింగ్‌లో ఉండగా.. ఇటీవలి బడ్జెట్‌ సమావేశాల తర్వాత పంపించిన మూడు బిల్లులకు కూడా గవర్నర్‌ ఆమోదం తెలపలేదని పిటిషన్లో పేర్కొనగా, తన పిటిషన్లో ప్రతివాదులుగా గవర్నర్‌ కార్యదర్శిని చేర్చారు.

ఆమోదం తెలపకుండా బిల్లులను వాయిదా వేస్తే హక్కు, ఆలస్యం చేసే హక్కు గవర్నర్‌కు లేదని వివరించింది. పెండింగులో ఉన్న బిల్లులకు ఆమోదం తెలపాల్సిందిగా గవర్నర్‌ను ఆదేశించాలని సుప్రీంకు విజ్ఞప్తి చేశారు. తన పిటిషన్‌తోపాటు మొత్తం పది బిల్లుల గెజిట్‌లనూ సి‌ఎస్ జత చేశారు.

ఇలా కోర్టుకు వెళ్ళడంతో మళ్ళీ కోల్డ్ వార్ మొదలైనట్లు అయింది. ఈ అంశంపై బి‌జే‌పి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందిస్తూ..బిల్లులను ఆమోదించడం లేదంటూ గవర్నర్‌ తమిళిసై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లడం సిగ్గుచేటు అని, గవర్నర్‌ వ్యవస్థను అప్రతిష్ఠపాలు చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ పని చేస్తున్నారని అన్నారు. అయితే ఇలా కోర్టుకు వెళ్ళడం వెనుక కే‌సి‌ఆర్ పోలిటికల్ స్ట్రాటజీ ఏమైనా ఉందా? అనే డౌట్ వస్తుంది. మరి సుప్రీం ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news