స్టేట్ బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్… ఇలాంటి మెసేజ్ వస్తే తప్పక కంప్లైంట్ చెయ్యండి..!

-

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు ఎన్నో రకాల సేవలు ని అందిస్తోంది. చాలా మంది కస్టమర్లు చక్కటి సేవలు ని పొందుతున్నారు. స్టేట్ బ్యాంక్ అందించే ఈ సేవలు వలన ఎన్నో రకాలుగా బెనిఫిట్స్ ని పొందొచ్చు. ఈమధ్య కాలంలో మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

మోసాల కారణంగా చాలా మంది డబ్బులు నష్టపోతున్నారు. ముఖ్యమైన వివరాలు కూడా మోసగాళ్ల చేతికి వెళ్ళిపోతున్నాయి. అటువంటి సమయం లో కస్టమర్స్ జాగ్రత్తగా ఉండాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లను హెచ్చరించింది. వినియోగదారులు నకిలీ సందేశాలకు స్పందించకూడదని హెచ్చరించింది బ్యాంకు.

ఇటువంటి మెసేజ్లకి స్పందించడం వలన మోసానికి గురవుతారు అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది. ”మీ YONO ఖాతా బ్లాక్ చేయబడుతుంది దయచేసి మీ పాన్ కార్డ్ నంబర్‌ను అప్‌డేట్ చేయడానికి లింక్‌పై క్లిక్ చేయండి” అని ఈ విధంగా మెసేజ్ వస్తుందని లింకు కూడా వస్తుందని అటువంటి అప్పుడు కస్టమర్లు క్లిక్ చేస్తున్నారని దీని కారణంగా మోసపోతున్నారని స్టేట్ బ్యాంకు వెల్లడించింది.

కస్టమర్లు బ్యాంకింగ్ వివరాలని షేర్ చేయకూడదు అలానే ఈమెయిల్ ఎస్ఎంఎస్ లకి ఎప్పుడు స్పందించకూడదని హెచ్చరించింది బ్యాంకు. ఒకవేళ కనుక మీకు ఇలాంటి మెసేజ్లు వస్తే వెంటనే [email protected]’కి రిపోర్ట్ చేయండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ప్రకారం ఖాతా నెంబర్లు పాస్వర్డ్ లేదా ఇతర ముఖ్యమైన విషయాలని ఎవరితోనూ పంచుకోకూడదు. అలానే మెసేజ్ వస్తే స్పందించకూడదు. ఏమైనా మెసేజ్లను వస్తే వాటికి అస్సలు స్పందించద్దు. జాగ్రత్త.

Read more RELATED
Recommended to you

Latest news