రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరనే చెప్పాలి. ఇక అప్పటి వరకు మౌనంగా ఉన్నవారు వెలుగులోకి రావొచ్చు లేదంటే ఊపు మీదున్న వారు కూడా స్వంత పార్టీలోనే పట్టు కోల్పోవచ్చు. పదవులు ఎప్పుడు ఎవరిని వరిస్తాయో ఎవరమూ చెప్పలేం. ఇక ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికల పుణ్యమా అని రాజీనామాల పర్వం నడుస్తోంది. కాంగ్రెస్, బీజేపీకి చాలామంది రాజీనామా చేసి కారెక్కుతున్నారు.
టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న మోత్కుపల్లి కేసీఆర్ అంటే తోక తొక్కిన త్రాచులా బుస కొట్టేవారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ను మోత్కుపల్లి ఎంతలా తిట్టారో అందరికీ తెలుసు. రోజులు మారాయి.. ఇప్పుడు మోత్కుపల్లి బీజేపీకి రాజీనామ చేశారు.
ఈటల బీజేపీలోకి రావడం ఇష్టం లేకనే బీజేపీని వీడుతున్నానని, ఈటల దళితుల భూములు కబ్జా చేశారని విమర్శలు కూడా చేశారు. దళిత బంధు చారిత్రాత్మక నిర్ణయమని, కేసీఆర్ దేవుడంటూ పొగడ్తలు కురిపించి అందర్నీ ఆశ్చర్య పరిచారు. ఇక ఈటల ఓటమి కోసం ఈటలకు వ్యతిరేకంగా హుజూరాబాద్‌లో ప్రచారం చేస్తానని చెప్పారు.
ఇదంతా చూస్తుంటే రాజకీయాలు తెలిసిన వారందరికీ ఇట్టే అర్థమవుతుంది.. మోత్కుపల్లి గులాబీ కండువ కప్పుకోబోతున్నారని. మరి కేసీఆర్ తో ముందుగా కుదిరిన ఒప్పందం వల్లే మోత్కుపల్లి బీజేపీని వీడారని, అదే క్రమంలో ఈటలను విమర్శిస్తున్నారని రాజీయ విశ్లేషకుల మాట. మరి టీఆర్ఎస్‌లో చేరితే మోత్కుపల్లికి సముచిత గౌరవం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. దళిత బంధు పథకం కూడా ఎస్సీ నేత చేతిలో పెట్టాలని భావించి మోత్కుపల్లికి ఆ బాధ్యతలు ఇచ్చేందుకు రెడీ అయ్యారంట. బీజేపీలో దక్కని గౌరవం మోత్కుపల్లికి టీఆర్ఎస్‌లో దక్కబోతుందన్నమాట.