డెల్టా డేంజర్.. ప్రపంచ వ్యాప్తంగా 10వేల మంది మృతి

-

కరోనా కొత్త వేరియంట్ డెల్టా పట్ల గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. వేగంగా విస్తరించే డెల్టా, డెల్టా ప్లస్ రకాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వారిస్తూనే ఉన్నారు. తాజాగా పెరుగుతున్న కరోనా కేసులు చూస్తుంటే డెల్టా వేరియంట్ విజృంభిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా గడిచిన 24గంటల్లో 7లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 10వేల మందికి పైగా కరోనా సోకడంతో మృత్యువాత పడ్డారు.

అటు అమెరికాలోనూ కేసుల సంఖ్య పెరిగింది. భారతదేశంలోనూ కేసుల పెరుగుదల కనిపిస్తుంది. మహారాష్ట్రలో డెల్టా ప్లస్ కేసులు 60కి పైగా వచ్చాయని సమాచారం. ఐదుగురు చనిపోయారని మహారష్ట్ర ప్రకటించింది. ఇటు కేరళలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. దేశం మొత్తం మీద వచ్చే కేసుల్లో సగానికి పైగా ఇక్కడి నుండే ఉన్నాయి. దాంతో పొరుగు రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అటు ప్రపంచంలోని కేసులు, ఇటు దేశంలోని కేసులు చూస్తుంటే మూడవ వేవ్ మొదలయ్యిందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఏది ఎలా ఉన్నా వచ్చే 4వారాలు కీలకంగా ఉండనుందని, కరోనా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news