ఎలాంటి ప్రభుత్వ సంబంధిత పనికైనా ఆధార్ తప్పనిసరి..ఆధార్ లేని మనిషి లేడు.. రోజు ఎన్నో అవసరాలకు ఆధార్ కార్డును వాడుతుంటాం..కానీ ఎప్పుడైనా దాని పైన ఉన్న బార్‌కోడ్‌ను గమనించారా..? అసలు ఎందుకు ఉందో తెలుసా… నిజానికి ఆధార్ కార్డ్ పైన ఉండే డీటెల్స్ కంటే ఆ బార్ కోడ్‌లో ఉండే డీటెల్స్ ఎక్కువట..!
ఈ క్యూఆర్ కోడ్‌లో కూడా మీ పేరు, పుట్టిన తేదీ, జెండర్, ఫోటో వంటి ఇతరత్రా వివరాలు అన్నీ ఉంటాయి.ఇవే కాకుండా క్యూఆర్ కోడ్‌లో మెయిల్, మొబైల్ నెంబర్ వంటివి వివరాలు కూడా ఇందులో ఉంటాయి. ఆధార్ కార్డులో ఇవి ఉండవు.
ఆధార్ కార్డు వెనుక భాగంలో ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం వల్ల ఐడెంటిటీని వెరిఫై చేయొచ్చు. యూఐడీఏఐ అధికారిక మొబైల్ యాప్ ద్వారా ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాల్సి ఉంటుంది. దీని కోసం మీరు ఆధార్ క్యూఆర్ స్కానర్ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
ఎప్పుడైనా ఆఫ్‌లైన్‌లోనే ఆధార్ ఐడెంటినీ వెరిఫై చేసుకోవడానికి ఆధార్ క్యూఆర్ కోడ్ ఉపయోగపడుతుందని యూఐడీఏఐ ట్విట్టర్ వేదికగా ఎప్పుడో తెలియజేసింది. ఆధార్ క్యూఆర్ కోడ్ స్కానర్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ఈ సేవలు పొందొచ్చని పేర్కొంది. ఆధార్ కార్డు మోసాలకు అడ్డుకట్ట వేయొచ్చు. ఆధార్ కార్డు నిజమైందా? కాదా? అందులోని వివరాలు కరెక్ట్‌గా ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని ఈ ఆప్షన్ ద్వారా చాలా సులభంగా క్షణాల్లో తెలుసుకోవచ్చు.
చాలామంది ఆధార్‌కార్డును నకీలి చేస్తారు. ఫోటో, అందులో వివరాలు మార్చేస్తారు. కానీ క్యూఆర్ కోడ్‌ను మాత్రం మార్చలేరు. కాబట్టి.. ఒక ఆధార్ కార్డు నకిలీదా లేదా అని తెలుసుకోవాలంటే.. ఈ క్యూ ఆర్ కోడ్ ఉపయోగపడుతుంది. ఆధార్ కార్డు ఉపయోగించి ఎన్నో మోసాలకు తెరలేపోచ్చు. ఆధార్ కార్డే కదా అని ఎవరికి పడితే వారికి అస్సలు ఇవ్వకండి. మనకు ఉన్న పెద్ద యునిక్యూ ఆస్తులు ఆధార్, ఫింగర్ ప్రింట్స్. మీ దగ్గర ఉన్నవి సేమ్ మరెవరి దగ్గరా ఉండవు అని గమనించారా..!!