కెసిఆర్ మనుషులు అన్ని పార్టీల్లో ఉన్నారు.. ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

-

బిఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. సీఎం కేసీఆర్ మనుషులు అన్ని పార్టీలలో ఉంటారని.. ఎవరికీ తెలియకుండా ఇన్ఫార్మర్లను కేసీఆర్ పెట్టుకున్నాడని ఆరోపించారు. వారు కోవార్తులుగా పనిచేస్తూ లీకులు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈటెల రాజేందర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

హైదరాబాద్ నగరంలో కొల్లగొడుతున్న భూములు అన్నిటిపై దమ్ముంటే సెట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంతా ఈటెల రాజేందర్ ఏం చేస్తున్నాడు? ఈటెలను ఎవరు కలుస్తున్నారు అనే చూస్తుందన్నారు. 2018లో హుజురాబాద్ నియోజకవర్గం లో కేసీఆర్ కొందరు చిల్లర గాలను పెట్టుకున్నాడని.. డబ్బులు ఇస్తే ఆ చిల్లరగాళ్ళు తనకి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారని మండిపడ్డారు. తనపై కొన్ని పత్రికలలో కేసీఆర్ అసత్య వార్తలు రాయించారని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version