sharwanand : శర్వానంద్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి తెలుసా..?

-

టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ హీరో శర్వానంద్ కూడా పెళ్లిపీటలెక్కబోతున్నట్లు కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. ఓ ఎన్‌ఆర్‌ఐను శర్వానంద్ పెళ్లాడబోతున్నాడని అన్నారు. మరి శర్వా పెళ్లాడబోతున్న అమ్మాయెవరు..? ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటో తెలుసుకుందామా..?
శర్వానంద్ పెద్దలు కుదిర్చిన పెళ్లికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇటీవల కథనాలొచ్చాయి.  త్వరలోనే ఆ శుభవార్తను అధికారికంగా చెప్పేందుకు సిద్ధమవుతున్నాడని తాజాగా తెలిసింది. శర్వా హైకోర్టు లాయర్ మధుసూధన్ రెడ్డి కుమార్తె  రక్షిత రెడ్డిని పెళ్లాడనున్నాడట. రక్షితకు పొలిటకల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. రాజకీయ నాయకుడు బొజ్జల గోపాల కృష్ణారెడ్డికి స్వయానా మనవరాలు.  ఆమె మేనమామ గంగారెడ్డి బొజ్జల గోపాల కృష్ణారెడ్డికి అల్లుడు. శర్వానంద్- రక్షిత రెడ్డి జోడీకి ఇరువైపులా కుటుంబ సభ్యులు త్వరలో పెళ్లి తేదీని ప్రకటించనున్నారు.
శర్వానంద్ నిశ్చితార్థం ఈనెల 26న హైదరాబాద్‌లోనే జరగనున్నట్టు సమాచారం. కానీ, ఇప్పటి వరకు అయితే శర్వానంద్ నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. డైరెక్టగా నిశ్చితార్థం చేసుకుని పెళ్లి తేదీని ప్రకటిస్తారో.. లేదంటే రేపు నిశ్చితార్థం, పెళ్లి తేదీల గురించి మీడియాకు వెల్లడిస్తారో చూడాలి. మొత్తానికి అయితే, ‘అన్‌స్టాపబుల్’ షోలో బాలయ్య అడిగిన ప్రశ్నకు చాలా త్వరగానే శర్వానంద్ సమాధానం ఇచ్చేస్తున్నారు. ప్రభాస్ చేసుకునేంత వరకు అయితే ఆగలేదు.
శర్వానంద్ కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న వేళ అభిమానుల్లో ఇది ఆసక్తికరంగా మారింది. ఇటీవలే వర్షం దర్శకుడు శోభన్ కుమారుడు సంతోష్ శోభన్ నటించిన `కళ్యాణం కమనీయం` చిత్రంలో పూర్తిగా పెళ్లిని వ్యతిరేకించేవాడిగా అతిథి పాత్రతో అలరించే ప్రోమో ఆకట్టుకుంది. ఇంతలోనే ఇప్పుడు శర్వా పెళ్లి ప్రకటన ఆసక్తిని కలిగించింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version