టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొన్నాళ్లుగా మయోసైటిస్ అనే ఆటోఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సామ్ సినిమా సెట్‌లోకి అడుగుపెడుతోంది. ఇటీవలే సిటాడెల్ సెట్‌లోకి అడుగుపెట్టిందంటూ ఆ సిరీస్‌లో హీరోగా నటిస్తున్న వరుణ్ ధావన్ అప్డేట్ ఇచ్చాడు.
ఇక బాలీవుడ్‌లో సిటాడెల్‌తో పాటు సామ్ తెలుగులో విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్న ఖుషి షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. అయితే విజయ్ దేవరకొండ ఖుషి టీమ్‌కు సమంత పెద్ద షాక్ ఇచ్చిందట. ఖుషి సినిమా కథ మార్చమని చెప్పినట్టు తెలుస్తోంది.
విజయ్ దేవరకొండ సమంత లీడ్ రోల్‌లో శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా ఫిక్స్ చేసుకున్నారు. ఆల్రెడీ ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా జరుపుకున్న ఈ సినిమా కథలో విజయ్ దేవరకొండ డామినేషన్ ఎక్కువ ఉందని.. సమంత పాత్రకు అంత ప్రిఫరెన్స్ లేదని టాక్.
గతంలో సమంత.. శివ నిర్వాణ దర్శకత్వంలో మజిలీ సినిమాలో నటించింది. ఈ సినిమా ఇచ్చిన విజయంతో శివ నిర్వాణపై సామ్ కు నమ్మకం కుదరడంతో ఖుషి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.
ఖుషి కథ విని ఓకే చెప్పిన సమంత మయోసైటిస్ వ్యాధి వల్ల చాలా నెలల పాటు ఇంటిపట్టునే ఉంది.
ఈ సమయంలో సినిమా కథ గురించి మరోసారి ఆలోచించినట్టుంది. ఆ మూవీలో తన పాత్రను విజయ్ పాత్ర డామినేట్ చేస్తోందని గమనించింది. తన పాత్ర చాలా వీక్‌గా ఉందని.. తన ఇమేజ్‌కు తగ్గట్లు కథలో కొన్ని మార్పులు చేయాలని టీమ్‌కు సూచించిందట. అయితే ఖుషి విషయంలో సమంత ఎందుకో తన పట్టు విడవట్లేదని అంటున్నారు. కథలో మార్పు కోసం బెట్టు చేస్తోందని తెలుస్తోంది. మరి ఆమెకు నచ్చినట్టు కథలో మార్పులు చేస్తారా లేదా అన్నది చూడాలి.