చైనాలో పుట్టిన మరో వైరస్.. ప్రపంచానికి ముప్పు తప్పదు..!

-

క‌రోనా వైర‌స్ వైరస్‌తో ప్రపంచదేశాలన్నీ వణికిపోతున్నాయి. ఇంకా భ‌యం తొల‌గ‌క‌ముందే.. చైనా ప‌రిశోధ‌కులు మ‌రో బాంబును పేల్చారు.  మ‌హ‌మ్మారిగా మారే ప్ర‌మాదం ఉన్న ఓ కొత్త ఫ్లూ వైర‌స్‌ ను గుర్తించిన‌ట్లు చెప్పారు. ఈ కొత్త వైరస్ పేరు G4 EA H1N1 అని పెట్టారు. 2009లో వ‌చ్చిన స్వైన్ ఫ్లూకు ద‌గ్గ‌ర‌గా ఈ ఫ్లూ ఉన్న‌ట్లు గుర్తించారు. ఈ వైర‌స్‌ ను అడ్డుకోవాలంటే.. పందుల‌ను నియంత్రించాల‌ని శాస్త్ర‌వేత్త‌లు పిలుపునిచ్చారు.

ప్రొసీడింగ్స్ ఆఫ్ ద నేష‌న‌ల్ అకాడ‌మీ ఆఫ్ సైన్సెస్ జ‌ర్న‌ల్‌ లో ఈ కొత్త వైర‌స్ గురించి ప్ర‌చురించారు. ఈ వైరస్ ఇప్పటికే జంతువులనుండి మనుషులకి సోకిందని తెలిసింది. మనిషి నించి మనిషి కి సోకుతుందేమో అని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. అదే జరిగితే మరొక మహమ్మారి తయారౌతుందని భయపడుతున్నారు. కనుక తొలిదశలోనే అరికట్టాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news