వర్షాకాలం లో ప్రకృతి పచ్చని చెట్లతో సహజ సౌందర్యాన్ని తెచ్చిపెడుతుంది.ఎండాకాలంతో వేడి గాలులు తో ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు వర్షాకాలం కోసం ఎదురుచూస్తారు. ఎప్పుడు ఎప్పుడు రుతుపవనాలు వస్తాయా ఎప్పుడు వానలు పడతాయా, అని ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు. ఇక వర్షాకాలం రాగానే వానలు పడతాయి. ఋతుపవనాలు, అల్పపీడనాల వల్ల అధికంగా వర్షాలు కురుస్తాయి. ఇలాంటి టైంలోనే నీరు కలుషితమై, ప్రజలు ఆరోగ్య సమస్యలతో ప్రమాదంలో పడతారు. మరి అలాంటి టైం లో మన కుటుంబాన్ని మనం ఈ నీటి కలుషితం నుండి ఎలా కాపాడుకోవాలో నిపుణులు ఎలాంటి సూచనలు ఇచ్చారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ముఖ్యంగా వర్షాకాలంలో నీరు కలుషితం అయ్యి పిల్లలు, వృద్దులు ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా వర్షాకాలంలో వాంతులు, డయేరియా, కడుపులో నొప్పి, జ్వరం, జలుబు వంటి వ్యాధులు ప్రబలుతాయి. వీడికి ముఖ్య కారణం నీరు కలుషితం అవడం. నీరు కలుషితం కాకుండా, మనం కొన్ని జాగ్రత్తలను పాటిస్తే ఇలాంటి ప్రాణాంతక వ్యాధుల నుండి మన పిల్లల్ని కుటుంబాన్ని కాపాడుకోవచ్చు మరి అలాంటి సూచనలు తెలుసుకుందాం..
నీటిని శుద్ధి చేయడం : ఈ సీజన్లో నీరు కలుషితం అవుతుంది. అందుకే మనం తాగే నీటిని కనీసం రెండు నిమిషాలు మరిగించి, చల్లార్చిన తర్వాత తాగాలి. ఇలా మరిగించడం వల్ల అందులో ఉండే బ్యాక్టీరియా వైరస్ నాశనం అవుతుంది. అలాగే ఆర్వో ప్లాంట్స్, నీటిని వడపోయడానికి ఫిల్టర్ లను ఉపయోగించవచ్చు ఇలాంటి ఫిల్టర్ లను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి లేదా వాటిని మార్చడం మాత్రం మర్చిపోకూడదు.
నీటిని నిల్వ చేయడంలో జాగ్రత్తలు: మనం వాడే నీటిని పరిశుభ్రమైన మూత ఉన్న కంటైనర్ లో నిలువ చేసుకోవాలి. పాతవి లేదా మురికి పట్టిన కంటైనర్లలో నీటిని ఎప్పుడూ నిల్వ ఉంచకూడదు. ఇంట్లో క్రమం తప్పకుండా మనం ప్రతిరోజు మన నీటి నిల్వ ఉంచుకునే బిందెలు,శుభ్రం చేసుకోవాలి. ఇక అలాగే వాటర్ ట్యాంకులను కూడా క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే వర్షాకాలంలో ట్యాంకుల్లో బురద బ్యాక్టీరియా ఎక్కువగా చేరుతుంది. వాటిలో కొంత క్లోరిన్ వేసి శుభ్రపరచుకోవడం కనీసం వారానికి ఒక రోజైనా చేయాలి.
ఇంటి చుట్టుపక్కల ఎక్కడ నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా చూసుకోవాలి. మురుగునీరు మంచినీటిలో కడవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇవేకాక వైద్యుడు సలహా పాటించాలి నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల లక్షణాలు అంటే వాంతులు, డయేరియా, జ్వరం లాంటి సమస్య ఏదైనా ఆరోగ్య సమస్య కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి.అంతేకాక పిల్లలకు తగిన టైం లో టీకాలను వేయించాలి.