ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాలు రసవతారంగా మారాయి. ఈ క్రమంలో గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచారంలో ముందుకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. కొన్ని కొన్ని సార్లు వారు చేస్తున్న కామెంట్లు ప్రజలని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. నాయకులమని మర్చిపోయి బూతులు మాట్లాడుతున్నారు.
తాజాగా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు,మాజీ ఎమ్మెల్యేలు మక్కెన మల్లికార్జున, జీ.వీ.ఆంజనేయులు, రావులపై అసభ్య దూషణలు చేశారు. మీడియా సమావేశం అని మర్చిపోయి పచ్చి బూతులు తిట్టారు. టీడీపీ వాళ్లు నోరు అదుపులో పెట్టు కోవాలని ఆయన హెచ్చరించారు.నేనేంటో చూపిస్తా కొడకల్లారా అంటూ విరుచుకుపడ్డారు. ఆయన మాటలకు అక్కడున్న వారంతా స్టన్ అయ్యారు.