రాముడు సత్యం కోసం పోరాడినప్పుడు, అతనికి శక్తి లేదు, వనరులు లేవు. కానీ రాముడికి నిజం, ఆశ, విశ్వాసం, ప్రేమ, దాతృత్వం, వినయం, ఓర్పు, ధైర్యం ఉన్నాయి అని గుర్తు చేశారు.న్యూఢిల్లీ లోని రామ్ లీలా మైదానంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి ప్రియాంకా గాంధీ మాట్లాడుతూ…అధికారం ఎవరి దగ్గరా శాశ్వతంగా ఉండదు, అధికారం వస్తుంది, పోతుంది, ఆ తర్వాత అహం కూడా తొలగిపోతుందని ప్రధాని మోదీకి చెప్పాలనుకుంటున్నాను అని అన్నారు.
ఆబద్ధాలు చెప్పడం మోదీకి అలవాటుగా మారిందన్నారు ప్రియాంక గాంధీ. రాంలీలా మైదానం నుంచే బీజేపీ పతనం ప్రారంభమైందని ,దుర్మార్గుడైన రావణుడికి అనంతమైన సైన్యం, ధనం ఉన్నప్పటికీ ఓటమి తప్పలేదని గుర్తు చేశారు.అలాగే రాజ్యాంగ సంస్థలను గుప్పిట పట్టిన ప్రధాని నరేంద్ర మోడీకి కూడా పతనం తప్పదన్నారు.కేంద్రంలోని బీజేపీ సర్కార్ రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తోందని రాహుల్ గాంధీ అన్నారు. అదే జరిగితే దేశంలో హింస చెలరేగి అగ్నిగుండంలా మారుతుందన్నారు రాహుల్ గాంధీ. ఈవీఎంల ట్యాపరింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ లు, మీడియాపై ఒత్తిడి లేకుంటే… బీజేపీకి 180 సీట్లు కూడా రావని అన్నారు.