క‌ళ్యాణ్ రామ్ బింబిసారా కోసం కీరవాణి..! ఇక బొమ్మ‌ బ్లాక్ బాస్ట‌రే

-

నంద‌మూరి హీరో క‌ళ్యాణ్ రామ్ మంచి హిట్ అందుకోక చాలా ఏళ్లే అవుతుంది. ఆయన ఇటీవ‌ల నటించిన సినిమాలు అన్ని కూడా నిరాశ ప‌ర్చాయి. అయితే త‌న ఆక‌లిని తీర్చుకోవ‌డానికి బింబిసారా అనే హిస్టారిక‌ల్ మూవీతో ముందుకు వ‌స్తున్నాడు. ఈ సినిమాను మ‌ల్లిడి విశిష్ట అనే డైరెక్ట‌ర్ తెరకెక్కిస్తున్నాడు. ఇప్ప‌టి కే ఈ సినిమాకు సంబంధించి పోస్ట‌ర్ ను విడుద‌ల చేశారు. అయితే ఈ సినిమాకు సంబంధించి చిత్రిక‌ర‌ణ కూడా ఎప్పుడో పూర్తి అయిన‌ట్టు తెలుస్తుంది.

స‌రైనా తేదీని ఫిక్స్ చేసి విడుద‌ల చేయాల‌ని చిత్ర యూనిట్ భావిస్తుంద‌ని స‌మాచారం. అయితే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా సంతోష్ నారాయ‌ణన్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అలాగే సాంగ్ కంపోస‌ర్ గా చిరంత‌న్ భ‌ట్ ఉన్నాడు. అయితే ఈ సినిమాకు వీళ్లు ఉన్నా.. అద‌న‌పు ఆక‌ర్షణ కావాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేసిన‌ట్టు తెలుస్తుంది. అందు కోసం హిస్టారిక‌ల్ సినిమాల‌కు ఫేమ‌స్ అయిన కీర‌వాణీని సంప్ర‌దించిన‌ట్టు తెలుస్తుంది.

అయితే కీర‌వాణీకి నంద‌మూరి కుటుంబానికి మ‌ధ్య ఉన్న స‌న్నిహిత్యం వ‌ల్ల ఈ సినిమాలోకి ఎంట్రీ ఇవ్వ‌డానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పాటు ఒక కీల‌క మైన పాటను కీర‌వాణితో చేయిస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఈ బీజీఎం, పాట పూర్తి అయిన త‌ర్వాత ఈ సినిమాను విడుద‌ల చేయ‌నున్నార‌ని స‌మాచారం.

Read more RELATED
Recommended to you

Latest news