ఆర్ఆర్ఆర్ : పాట‌లేంటి బ్ర‌ద‌ర్ అలా ఉన్నాయి? న‌చ్చ‌లేదు బాస్ !

-

ప‌చ్చి ప్రాయాల‌ను పంచుకుంటాను అని చెప్పింది అవంతిక
ఆ పాట ఎంత పెద్ద హిట్టో !
పడ‌మ‌ర కొండ‌ల్లో వాలిన సూరీడా అని పాడాడు కాల భైర‌వ
ఆ పాట ఎంత మందికి న‌చ్చిందో !
ఆ స్థాయిలో ట్రిపుల్ ఆర్ పాట‌లు లేవు
సాహిత్యం లేదు అంతా నాటు నాటు నాటు
ఊర నాటు అంటూ దంచికొట్టారు ప‌దాల‌తో!
ఇంత‌కుమించి ఆ పాట‌లో ఏముందండి !
ఓసారి అమ్మైనా నాన్నైనా పాట వినండి ఎంత బాగుంటుంది. సీతారామ శాస్త్రి ఎంత గొప్ప‌గా రాశారో ! సింహాద్రి సినిమాకో
మైలు రాయి ఆ పాట.. అదే రైట‌ర్ దోస్తీ పాట రాశారు.. ఏమ‌యింది .. అందులో ఉన్న సాహిత్య విలువలు ఎంత? క‌నుక ఆర్ఆర్ఆర్ సంగీత ప‌రంగా శ్రోత‌ల‌ను నిరాశ‌ప‌రిచింది. కీర‌వాణి స్థాయి ఏమ‌యిందో మ‌రి! కానీ పాటలు వాటితో పాటు ఆర్ ఆర్ అన‌గా రీ రికార్డింగ్ ఎఫెర్ట్ కూడా బాలేద‌నే తేలిపోయింది.

 

నచ్చానా…అని అడిగింది అవంతిక..ఓ…అంతగా అన్నారు ప్రేక్షక జనం, హంసనావ పై అలల ఊయలలూపింది దేవసేన. ఓహోహో అనుకున్నారు అభిమానగణం. ఆ పాటలపై మనసుపడ్డారు…మెచ్చి గుండెల్లో పచ్చబొట్లేసుకున్నారు….. ఝటాకటాహ సంగ్రహం అంటూ రావణ కృత శివ స్తోత్రం స్తుతిబద్ధంగా ప్రతిధ్వనిస్తే…. ఆ ప్రతిధ్వనిలో ప్రేక్షకులు మైమరిచిపోయారు. ఓ మమతలతల్లి బాహుబలినే కాదు మనల్ని కూడా లాలించింది. కంటేనే అమ్మ కాదని, అమ్మ ప్రేమకు సాటిలేదని చెప్పకనే చెప్పింది. హేస్లా…. రుద్రస్స అన్న బాహుబలి వీరత్వం ముందు ….మదగజ ఘీంకారం అల్పంగా వినిపించింది..బాహుబలి రెండు భాగాల్లోని ఈ పాటలు సాహిత్యం,సౌందర్యం, సంగీతం, చిత్రీకరణం ఇలా అన్నింటిని, అన్నింటితో పోటాపోటీగా నిలిపిన ఘట్టాలు. అందుకే ప్రేక్షకులు ఈ సినిమా పాటలకు నీరాజనాలు పట్టారు. దండాలయ్యా అంటూజైకొట్టారు ప్లే లిస్ట్‌లలో చార్ట్‌బస్టర్స్‌గా నిలిపారు. కీరవాణి మరికొన్నేళ్లు సినిమాతో దోస్తీ చేసేందుకు కావల్సిన ఉత్సాహాన్నిచ్చారు.

మరి ఆర్‌ఆర్‌ఆర్‌ విషయంలో ఏవి ఆనాటి సంగీత సౌరభాలు…మనసును ఓలలాడించిన గీతాలు….అసలిప్పుడు ఆ పోలిక ఎందుకు? ఏమైంది బాహుబలితో పోలిస్తే ఈ సినిమాలో పాటలు ఎందుకు అంతగా ప్రాచుర్యం పొందలేకపోయాయి? ప్రేక్షకులకే కాదు ఆ సినిమా బృందంలో చాలామంది కూడా ఈ సంగీతం అంతగా రుచించలేదు. ఎందుకంటే ట్యూన్లలో కనిపించని కొత్తదనం ఒక కారణం అయితే….బాహుబలి ఎఫెక్ట్‌ నుంచి ఇంకా బయటపడకపోవడం మరొక కారణం.. పాతదనం ఆహ్లాదపరుస్తుంది. కానీ కొత్తదనాన్ని ఆహ్వానించలేకపోతే కొన్నాళ్లకి అదే బోర్‌కొట్టిస్తుంది. అందుకే అర్‌ఆర్‌ఆర్‌ సంగీతం అంతగా ఆకట్టుకోలేదు. .కీరవాణి ఒకరకంగా ఇప్పుడు తనకు తానే ప్రత్యర్థి. రాజమౌళి టేకింగ్‌ వల్ల మాత్రమే ఆ పాటలకు ఇప్పుడున్న రెస్పాన్స్‌ అనడంలో ఏమాత్రం అతిశయం లేదు.

– మ‌న లోకం ప్ర‌త్యేకం

Read more RELATED
Recommended to you

Latest news