ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ గత కొద్ది రోజుల నుంచి క్రమంగా తగ్గుతూ వస్తుంది. కానీ నేడు.. నిన్నటితో పోలిస్తే.. కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. కాగ ఈ రోజు కరోనా వైరస్ బులిటెన్ ను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కాసేపటి క్రితం విడుదల చేశారు. ఈ కరోనా బులిటెన్ ప్రకారం.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 40 మందికి కరోనా వైరస్ పాజిటివ్ అని తెలింది.
అయితే నిన్న ఏపీలో 31 కరోనా కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. అంటే నిన్నటితో పోలిస్తే.. నేడు 9 పాజిటివ్ కేసులు పెరిగాయి. కాగ అత్యధికంగా అనంతపురం జిల్లాలో 15 కేసులు వెలుగు చూశాయి. అలాగే నాలుగు జిల్లాల్లో జీరో కేసులు నమోదు అయ్యాయి. ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 55 మంది కరోనా వైరస్ బాధితులు పూర్తి కోలుకున్నారు.
దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం 429 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే ఈ రోజు కూడా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి కరోనా మరణాలు నమోదు కాలేదు. కాగ గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు 10,515 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.