తమిళనాడులో రాహుల్ వరుస పర్యటనలు అందుకేనా

Join Our Community
follow manalokam on social media

తమిళనాడుపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు రాహుల్‌ గాంధీ. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. ఆయన మాత్రం రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. ఇటీవల జల్లికట్టు చూసేందుకు వచ్చిన రాహుల్‌.. ఇప్పుడు మూడ్రోజుల పర్యటనకు కోయంబత్తూరుకు చేరుకున్నారు. తమిళ సంస్కృతిని టచ్‌ చేస్తూనే.. మోదీపై విరుచుకుపడుతున్నారు రాహుల్‌. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా వరుస పర్యటనల వెనుక రాహుల్ లాజిక్ ఎంటన్నదాని పై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తుంది.

తమిళనాడులో పొలిటికల్‌ సీన్‌ హీటెక్కింది. ముఖ్యంగా ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. కానీ అప్పుడే ప్రచార హోరు మొదలు పెడుతున్నాయి ప్రధాన పార్టీలు. అధికార పార్టీ అన్నాడీఎమ్‌కే ఇప్పటికే ప్రభుత్వ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తోంది. అయితే కాంగ్రెస్‌ పార్టీ తమిళనాడు మీద ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టింది. ఆ పార్టీ ఎంపీ రాహుల్‌ గాంధీ తరుచుగా తమిళనాడు వస్తున్నారు. ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా తమిళ జనం, భాష, సంస్కృతిపై ప్రశంసలు గుప్పిస్తూ ప్రసంగాలు చేస్తున్నారు రాహుల్‌ గాంధీ.

రాహుల్‌ గాంధీ తమిళనాడులో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. కోయంబత్తూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. మోడీకి తమిళ సంస్కృతి, భాష, జనం మీద ఏ మాత్రం గౌరవం లేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ భిన్న మతాలను, భాషలను, పౌరులను గౌరవిస్తుందని చెప్పారు రాహుల్‌ గాంధీ.

కోయంబత్తూరులోని చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రతినిధులతో రాహుల్‌ సమావేశమయ్యారు. జీఎస్టీతో ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. యూపీఏ అధికారంలోకి వస్తే జీఎస్టీలో మార్పులు, చేర్పులు తీసుకొస్తామని చెప్పారు. అయితే రాహుల్‌ టూర్‌ సాగుతుండగానే కోయంబత్తూరులో సీఎం పళనిస్వామి కూడా భారీ ర్యాలీ తీశారు.

 

 

TOP STORIES

యూపీఐ ద్వారా చెల్లింపులు జ‌రుపుతున్నారా ? ట్రాన్సాక్ష‌న్ లిమిట్స్ ఎంతో తెలుసుకోండి..!

ప్ర‌స్తుతం దాదాపుగా ఎవ‌రిని చూసినా డిజిట‌ల్ పేమెంట్ల‌నే ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారు. న‌గ‌దుతో లావాదేవీల‌ను చాలా త‌క్కువ‌గా చేస్తున్నారు. కార‌ణం.. బ‌య‌ట ప్ర‌తి చోటా ఆన్‌లైన్ లో...