పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేష్..!

-

మహానటి కీర్తిసురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నేషనల్ అవార్డు గ్రహీతగా మరింత పాపులారిటీ దక్కించుకున్న ఈమె ఇటీవల దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక సినీ కుటుంబం నుంచి వచ్చిన ఈమె తల్లి మేనక నటిగా మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఇక ఈమె తండ్రి సురేష్ నిర్మాతగా ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యారు. ఇక వీరి వారసత్వంతో ముందుగా మలయాళం లో నటిగా సినీ రంగ ప్రవేశం చేసిన కీర్తి సురేష్ ఆ తర్వాత కోలీవుడ్ చిత్రంలో కూడా నటించింది.

ఇక తెలుగులో మహానటి సినిమా తర్వాత ఉత్తమ నటిగా అవార్డును గెలుచుకోవడమే కాదు ఏ తరహా పాత్రనైనా అవలీలగా నటించి శభాష్ అనిపించుకుంటుంది అని అందరి చేత మన్ననలు పొందింది. అంతే కాదు ఈ సినిమా తర్వాత మళ్లీ వెనుతిరిగి చూడలేదు. ఇక ప్రస్తుతం తమిళంలో ఉదయినిధి స్టాలిన్ కు జంటగా నటించిన మామన్నన్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న కీర్తి సురేష్ కి పెళ్లి గురించి ఎక్కువగా వార్తలు వినిపించాయి.

ఇకపోతే ఒక పారిశ్రామికవేత్తను వివాహం చేసుకోబోతుందని.. ఆమె తల్లిదండ్రులు తనకు ఈ సంబంధం చూశారు అంటూ వార్తలు బాగా వైరల్ అయ్యాయి. కానీ ఇందులో నిజం లేకపోయింది. అంతేకాదు ఈ విషయాలపై కీర్తి సురేష్ తల్లి స్పందిస్తూ.. ఒకవేళ కీర్తి ఎవరినైనా ప్రేమిస్తే ముందుగా మీతోనే చెబుతామంటూ స్పష్టం చేసింది అయినా కూడా ఈ వార్తలకు ఎక్కడ బ్రేక్ పడలేదని చెప్పాలి. ఇక ఇప్పుడు ప్రమోషన్స్ లో భాగంగా కూడా ఆమెకి ఇలాంటి ప్రశ్న ఎదురయ్యింది. కానీ ఆమె మాత్రం ఏమాత్రం సందేశించకుండా ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆస్కారమే లేదు అంటూ నిక్కచ్చితంగా చెప్పేసింది. దీన్ని బట్టి చూస్తే ఇంకా ఆమె కెరియర్ లో ముందుకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news